అటు ఇటు తిరిగే హనుమంతుడు !

16-07-2014 Wed 12:03

ఏ ఆలయంలోనైనా భగవంతుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసించాలంటే, ఆశ్చర్యచకితులను చేసే కొన్ని సంఘటనలు భక్తుల అనుభవంలోకి వస్తుండాలి. అప్పుడే ఆ ఆ భక్తుల విశ్వాసంతో పాటు ... ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వుంటుంది. అలా ఆలయ అర్చకులతో పాటు అక్కడ నిద్రచేసిన భక్తులను కూడా ఆశ్చర్యచకితులను చేసే హనుమంతుడి ఆలయం మనకి నల్గొండ జిల్లా 'కోదాడ'లో కనిపిస్తుంది.

ఇక్కడి హనుమంతుడు అభయముద్రను కలిగి చక్కని ఆకారంలో దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడ ఆలయం నిర్మించి చాలాకాలమే అవుతున్నా, స్వామి విగ్రహం మాత్రం చాలా పురాతనమైనదిగా చెప్పబడుతోంది. ఒకప్పుడు అడవీ ప్రాంతంలో గల ఈ విగ్రహనికి పూజలు లేకపోవడంతో, అక్కడి గిరిజనులే నైవేద్యాలు పెడుతూ ఉండేవాళ్లట. కాలక్రమంలో అక్కడి గిరిజనులు ఈ ప్రాంతానికి వలస రావడం జరిగింది.

ఆ సమయంలోనే ఇక్కడి ఆలయ నిర్మాణం పూర్తవుతూ వుండటం, అక్కడి గిరిజనులు ఇచ్చిన సమాచారంతో ఈ విగ్రహాన్ని తెప్పించడం జరిగిందని చెబుతారు. స్వామి మహిమాన్వితుడనీ, మహర్షులు ... సిద్ధులు మొదలైన వాళ్లచే పూజలు అందుకుని ఉంటాడని భావిస్తారు. ఇక స్వామివారు ప్రతి రోజు ఉదయం రెండు గంటల సమయంలో ఆలయంలో నుంచి బయటికి వెళుతున్నట్టుగా అడుగులు చప్పుడు వినిపిస్తూ ఉంటుందట. అలాగే ఉదయం నాలుగు గంటలకు తిరిగి గర్భాలయంలోకి వెళుతున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తూ ఉంటుందట.

బలమైన వ్యక్తి గంభీరంగా నడచినట్టుగా ఈ చప్పుడు వినిపిస్తూ ఉంటుందని అర్చకులతో పాటు కొంతమంది భక్తులు చెబుతుంటారు. ఈ కారణంగా స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువుదీరాడని భక్తులు విశ్వసుస్తుంటారు. హనుమంతుడి అనుగ్రహాన్ని కోరుతూ, గ్రహ దోషాలకు సంబంధించిన హోమాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు.


More Bhakti Articles
Telugu News
Satya Pal Malik says Have no plans to join active politics
క్రియాశీలక రాజకీయాలకు దూరం: మేఘాలయ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
11 minutes ago
Gold and currency decorated deity in Penugonda
ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వర్ణమయం... గోడలనిండా కరెన్సీ కట్టలే!
8 hours ago
Ganguly opines on Bumrah issue
బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదు: గంగూలీ
9 hours ago
tpcc chief revanth reddy reviews on rahul gandhi yatra
అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ యాత్ర‌... రేపు డీజీపీని క‌లిసి అనుమ‌తి కోర‌తామ‌న్న రేవంత్ రెడ్డి
9 hours ago
Ukraine wants speedup NATO membership process after Russia annexes four regions
తమ భూభాగాలను రష్యా కలిపేసుకోవడంపై ఉక్రెయిన్ స్పందన... వెంటనే తమను నాటోలో చేర్చుకోవాలని విజ్ఞప్తి
9 hours ago
Pawan Kalyan attends Harihara Veeramallu workshop
'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
9 hours ago
ap government extends liquor policy for a year
ఏపీలో ఈ సారి మ‌ద్యం షాపుల త‌గ్గింపు లేదు... పాత పాల‌సీకి ఏడాది పాటు పొడిగింపు
10 hours ago
Vijayasai Reddy appeal to Tollywood heroes and producers
టాలీవుడ్ చిత్రాలకు 60 శాతం మార్కెట్ ఏపీనే: విజయసాయిరెడ్డి
10 hours ago
A Murali resigns adisor to ap government
ఏపీ స‌ల‌హాదారు ప‌దవికి రాజీనామా చేసిన ముర‌ళి... కార‌ణాన్ని వివ‌రిస్తూ జ‌గ‌న్‌కు లేఖ‌
10 hours ago
Suriya and Ajay Devgan receives national best actor award
ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం... బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్
10 hours ago