స్వామి పల్లకీ మోయలేకపోయిన భక్తులు

25-03-2014 Tue 09:24

అక్కల్ కోట స్వామి ధోరణి చాలా విచిత్రంగా ఉండేది. ఆయన ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ తెలిసేది కాదు. ఒక్కోసారి కొంతమంది భక్తుల తీరుపట్ల మండిపడుతున్నట్టు కనిపించిన ఆయన, ఆ మరుక్షణమే వారితో ఆత్మీయంగా ... చనువుగా ఉండేవారు. ఆయనలా వ్యవహరించడం వెనుక ఏదో కారణం ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఇక ఆయన మహిమలను ప్రత్యక్షంగా చూడాలని కొంతమంది భక్తులు రోజుల తరబడి నిరీక్షించి నిరాశ చెందేవారు. అంతలోనే స్వామి ఏదో ఒక మహిమ చేసి చూపేవారు. అయితే ఆ సంఘటనలో నుంచి తేరుకుని అది మహిమ అని తెలుసుకోవడానికి వాళ్లకి కొంత సమయం పట్టేది. ఆ తరువాత ఆనందాశ్చర్యాలకి లోనవుతూ వాళ్లు స్వామి దగ్గర నుంచి సెలవుతీసుకుంటూ ఉండేవాళ్లు.

ఈ నేపథ్యంలోనే ఒకసారి కొంతమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటోన్న సమయంలో వర్షం మొదలవుతుంది. తనని పల్లకీలో ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను స్వామి ఆదేశిస్తాడు. అంతకుమించిన అదృష్టం లేదన్నట్టుగా భక్తులు స్వామిని పల్లకీలో ఎక్కించి నడవడం మొదలుపెడతారు. అయితే క్షణక్షణానికి పల్లకీ బరువు పెరిగిపోతూ ఉండటంతో భక్తులు ఆశ్చర్యపోతారు.

ఇక పల్లకీని మోయడం తమ వల్ల కాదన్నట్టుగా కిందకు దింపేస్తారు. చిరుమందహాసంతో వారివైపు చూస్తూ విషయమేవిటని అడుగుతాడు స్వామి. ఆయన బరువు తగ్గకపోతే తాము పల్లకీని మోయలేమని చెబుతూ, తమని పరీక్షించవద్దని కోరతారు. సరే మరోసారి ప్రయత్నించి చూడమని చెబుతాడు స్వామి. ఈ సారి భక్తులు పల్లకిని పైకి లేపుతారు. అంతకుముందు ఖాళీ పల్లకీ ఉన్నంత బరువు కూడా ఇప్పుడు లేకపోవడం వారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది.

అలా స్వామిని భక్తులు వర్షంలో తిప్పి తీసుకువస్తారు. స్వామివారు హఠాత్తుగా బరువు పెరగడం ... తగ్గడం గురించి భక్తులు ప్రస్తావిస్తారు. మొదట వాళ్లు మోసినది తన శరీరాన్ననీ ... ఆ తరువాత వాళ్లు మోసినది తన ఆత్మని మాత్రమేనని చెబుతాడు స్వామి. మరింత ఆశ్చర్యపోయిన భక్తులు ఆయన పాదాలకు సవినయంగా నమస్కరిస్తారు.


More Bhakti Articles
Telugu News
TS Govt is Allowing ambulances at borders
ఎట్టకేలకు సరిహద్దుల్లో అంబులెన్సులను అనుమతిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!
19 minutes ago
In coming 10 months 250 million doses will be available in India
రానున్న 10 నెలల్లో 250 మిలియన్ల స్పుత్నిక్‌-వి టీకాలు
47 minutes ago
Purandeswari condemns Raghurama Krishna Raju arrest
న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారు?: పురందేశ్వరి 
53 minutes ago
Nara Lokesh strongly condemns Ragurama Krishna Raju arrest
రఘురామ అరెస్ట్ జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం: లోకేశ్
1 hour ago
Single dose corona vaccines likely roll out in India
భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు... రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లైట్
1 hour ago
Delhi Police Seek details from gautham gambhir about Fabiflu distribution
కరోనా ఔషధ పంపిణీపై గంభీర్‌ను వివరణ కోరిన ఢిల్లీ పోలీసులు
1 hour ago
Another lot of Covishield vaccine doses arrives AP
ఏపీకి చేరుకున్న మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు
1 hour ago
Vekaiah naidu om birla did not allow standing committee meetings virtually
స్థాయి సంఘాల వర్చువల్‌ సమావేశాలకు అనుమతి ఇవ్వని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌!
1 hour ago
Balineni reacts after AP CID officials arrests MP Raghurama Krishna Raju
రఘురామకృష్ణరాజు ఓ సైకో... జగన్ ఓపికపట్టడంతో ఇన్నాళ్లు రెచ్చిపోయాడు: మంత్రి బాలినేని
2 hours ago
Chandrababu set to spend one crore in Kuppam constituency
కుప్పం ప్రజలకు చంద్రబాబు భరోసా... కరోనాను ఎదుర్కోవడానికి రూ.1 కోటి వ్యయంతో పలు కార్యక్రమాలు!
2 hours ago