ముక్తిని ప్రసాదించే ముక్కంటి క్షేత్రం

11-01-2014 Sat 10:03

ఉత్తర భారతదేశంలోనూ ... దక్షిణ భారతదేశంలోను అనేక ప్రాంతాల్లో విశిష్టమైన శైవక్షేత్రాలు దర్శనమిస్తూ వుంటాయి. కొన్ని ఆలయాలు నదీ తీరాలలోను ... మరికొన్ని ఆలయాలు కొండ గుహలుగా కొలువై కనిపిస్తుంటాయి. ఎంతో మంది మహర్షులు ఈశ్వర కటాక్షం కోసం వివిధ ప్రాంతాల్లో పరమశివుడిని ప్రతిష్ఠించి పూజించారు. సాక్షాత్తు సదాశివుడే ఆ ప్రదేశంలో కొలువై ఉండేలా మాట తీసుకున్నారు.

అలా ఆయా ప్రాంతాల్లో ఆవిర్భవించిన మహాదేవుడు కోరిన వారికి కొంగుబంగారమై అలరారుతున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలోని 'సంపర' క్షేత్రం ఈ నేపథ్యంలో ఆవిర్భవించినదే. సకల సంపదలను ప్రసాదించే సదాశివుడు ఈ క్షేత్రంలో 'ముక్తేశ్వరుడు' గా పిలవబడుతున్నాడు. పూర్వం అగస్త్య మహర్షి తన సతీమణి 'లోపాముద్ర'తో కలిసి దక్షిణ పథంలో పర్యటించాడు. ఆ సందర్భంలో ఆయన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు.

దర్శన మాత్రం చేతనే ఈ స్వామి ముక్తిని ప్రసాదిస్తాడనీ, అందువలన ముక్తేశ్వరుడు పేరుతో ఆరాధించమని స్థానికులతో అగస్త్య మహర్షి చెప్పాడట. ఆనాటి నుంచి స్వామికి నిత్య పూజాభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. కాలక్రమంలో స్వామివారికి ఆలయం నిర్మించబడింది. చూడచక్కని రాజగోపురంతో కుదురుగా కనిపించే ఈ ఆలయం వాస్తు రీత్యా కాశీని పోలి వుండటం వలన ఈ క్షేత్రాన్ని 'చిన్నకాశీ' అని పిలుస్తుంటారు.

గర్భాలయంలో శివలింగం పక్కనే బాలా త్రిపురసుందరి మూర్తి వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ఆ పక్కనే వల్లీ దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్యస్వామి పూజలు అందుకుంటూ ఉంటాడు. ఎందరో రాజులు ... యోగులు ఇక్కడి స్వామిని సేవించి తరించినట్టు చెబుతారు. కార్తీకమాసంలోను ... శివరాత్రి పర్వదినం సందర్భంగాను ఇక్కడి స్వామివారిని వేలాదిగా భక్తులు దర్శించుకుని ధన్యులవుతుంటారు.


More Bhakti Articles
Telugu News
Amara Raja Group to shift its plant to Tamilnadu from AP
ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనున్న ‘అమరరాజా’!
9 minutes ago
Rotavac 5D Bharat Biotechs rotavirus vaccine receives Prequalification from WHO
భారత బయోటెక్ రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
39 minutes ago
BJP leader Lakshman comments
రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల జలజగడం: బీజేపీ నేత లక్ష్మణ్
9 hours ago
BJP delegation under Somu Veerraju will leave for Delhi tomorrow
సోము వీర్రాజు నేతృత్వంలో ఢిల్లీ వెళుతున్న ఏపీ బీజేపీ బృందం
9 hours ago
Indian student died in China versity
చైనా వర్సిటీలో బీహార్ విద్యార్థి మృతి
9 hours ago
Pawan and Rana starring remake release date confirmed
పవన్, రానా చిత్రం రిలీజ్ డేట్ ఖరారు
9 hours ago
Babul Supriyo says he will continue as MP
ఎంపీగా కొనసాగుతా: మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
10 hours ago
MAA President Naresh responds to Nagababu comments
నాగబాబు వ్యాఖ్యలు చాలా బాధించాయి: 'మా' అధ్యక్షుడు నరేశ్
10 hours ago
Telangana corona cases update
తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు
10 hours ago
Sajjala and Vishnu counters CM KCR comments
కృష్ణా జలాల వివాదం: కేసీఆర్ పై విరుచుకుపడిన సజ్జల, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
11 hours ago