శ్రీ దత్తానుగ్రహం

17-12-2013 Tue 11:11

అజ్ఞానమనే చీకటి అలుముకుని ఉన్నంత వరకూ ఆ చీకటికి అవతల ఏవుందనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచనే కలగదు. అలాంటి ఆలోచన కలగనంత వరకూ ఆ చీకటికి అవతల ఏమీలేదనే అనిపిస్తుంది. అయితే అజ్ఞానమనే చీకటిని తరిమివేయడానికి జ్ఞానమనే కాగడా వెలిగించాలి. ఆ వెలుగు ముందుకు దారి చూపుతుంది ... అనుకున్న గమ్యానికి చేరుస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరికీ గురువు సహకారం అవసరం.

మానవుడిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన భిక్షను ప్రసాదించే శక్తి ఒక్క గురువుకి మాత్రమే వుంటుంది. జ్ఞానం వల్లనే ప్రతి ఒక్కరూ నిజానిజాలను గుర్తించగలుగుతారు ... తమ గురించి తాము తెలుసుకోవడమే కాకుండా దైవం యొక్క తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా అనేకమంది దేవతల నుంచి సామాన్య మానవుల వరకూ జ్ఞాన భోద చేశాడు శ్రీ దత్తాత్రేయస్వామి.

అందుకే శ్రీ దత్తాత్రేయుడిని విశ్వ గురువుగా అంతా ఆరాధిస్తుంటారు ... ఆయన జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మిగతా ఆలయాలతో పోలిస్తే శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయాలు తక్కువగానే కనిపిస్తాయి. అందువలన ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలు ... కొంత కాలంపాటు తపస్సు చేసుకున్న ప్రదేశాలు ... తన అవతారాలుగా చెప్పబడుతోన్న అవధూతల ఆలయాలను భక్తులు దర్శించి తరిస్తుంటారు.

ఈ నేపథ్యంలో 'పిఠాపురం' ... 'కురువపురం' ... 'గాణుగాపురం' ... 'నెరవాడ' ... ' షిరిడీ' వంటి క్షేత్రాలు ఈ జాబితాలో కనిపిస్తాయి. ఇక ఇటీవల కాలంలో ప్రతి శిరిడీ సాయిబాబా మందిరంలోను శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠిస్తూ వుండటం వలన స్వామిని దర్శించే అవకాశం ... అదృష్టం అందరికీ లభిస్తోంది. దత్త జయంతి రోజున అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.

స్వామివారికి సంబంధించిన పీఠాలలో ఆయన పాదుకలను దర్శించాలి ... అవకాశం వుంటే వాటిని శిరస్సుతో స్పర్శించాలి. స్వామి కొలువైన తీరంలో గల నదులలో స్నానం ఆచరించి, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. వీలుంటే స్వామి ప్రతిమకు పాదసేవగా ఆయన కాళ్లను వత్తడం చేయాలి. ఈ విధంగా చేయడం వలన అజ్ఞానం అంతరించి జ్ఞానం వికసిస్తుంది. జన్మజన్మలుగా వెంటాడుతూ వస్తోన్న పాపాలు ... శాపాలు ... దోషాలు ... దారిద్ర్యం నశిస్తాయి. అనారోగ్యాలు ... ఆపదలు తొలగి సకల శుభాలు చేకూరతాయి.


More Bhakti Articles
Telugu News
Fire Accident in Dakshin Express
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
22 minutes ago
England lose five in response to Indias 416
బర్మింగ్‌హామ్ టెస్టు: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
47 minutes ago
Pawan Kalyan selfie with Janasene Veera Mahilas
వీరమహిళలతో సెల్ఫీ దిగి ఉత్సాహపరిచిన పవన్ కల్యాణ్
9 hours ago
BJP National Plenary first day meetings concluded
హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలిరోజు సమావేశాలు
9 hours ago
Vijayasai appreciates CM Jagan daughter Harshini
కంగ్రాచ్యులేషన్స్ హర్షిణి... జగన్ తనయను అభినందించిన విజయసాయి
9 hours ago
trs mlc kavitha reached Washingtonin america
అమెరికాలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌... ఆటా మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రుకానున్న ఎమ్మెల్సీ
9 hours ago
Center allows to receive ten lakh rupees from abroad residents
విదేశాల్లో ఉన్నవారి నుంచి ఇకపై రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు... కేంద్రానికి వివరాలు చెప్పనక్కర్లేదు!
9 hours ago
modi appreciated telanagana bjpleaders over arrangements to party meeting
ఏర్పాట్లు ఆదుర్స్‌!... తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు మోదీ ప్ర‌శంస‌!
9 hours ago
MHA handed over pharmacist murder case to NIA
మహారాష్ట్రలో ఫార్మసిస్టు హత్య... నుపుర్ కు మద్దతు పలకడంతో చంపి ఉంటారని అనుమానం... ఎన్ఐఏ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
10 hours ago
Rain stops play in Birmingham test between Team India and England
టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు
10 hours ago