పాతివ్రత్యానికి పరీక్ష!

16-11-2013 Sat 20:31

ఓ రోజున 'చ్యవన మహర్షి' తన ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ వుండగా, దేవతా వైద్యులైన అశ్వనీకుమారులు (సూర్యపుత్రులు) అక్కడికి వస్తారు. అదే సమయంలో నది నుంచి నీరు తీసుకువస్తోన్న 'సుకన్య'ను చూస్తారు. చ్యవన మహర్షిని కలుసుకోవడానికి వాళ్లు వచ్చి ఉంటారని భావించిన సుకన్య, ఆయన ధ్యానంలో ఉన్నట్టుగా చెబుతుంది. ఆయనతో తమకి ఎలాంటి పని లేదనీ, ఆమె సౌందర్యం గురించి విన్న కారణంగా చూసి వెళదామని వచ్చామని వాళ్లు సమాధానమిస్తారు. ఆ మాటలకు సుకన్య ఒక్కసారిగా బిత్తరపోతుంది. అశక్తుడైన వృద్ధుడిని ... అందునా అంధుడిని పెళ్లాడి అందమైన యవ్వనాన్ని అడవిపాలు చేయవద్దని వాళ్లు సుకన్యతో అంటారు. ఆమె అంగీకరిస్తే వివాహం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతారు. తమని వివాహమాడటం వలన, అనంతమైన భోగాలను అనుభవించ వచ్చని అంటారు. అలా ఎన్ని విధాలుగా ఆశ చూపినా సుకన్య పట్టించుకోకపోవడంతో, ఆమెను తాకడానికి సిద్ధపడతారు. అప్పటి వరకూ సహనాన్ని పాటిస్తూ వచ్చిన సుకన్య, వారిని శపించబోతుంది. దాంతో కంగారుపడిపోయిన అశ్వనీ కుమారులు, తమ గురించి సుకన్యకు చెబుతారు. ఆమె పాతివ్రత్యం గురించి విన్నామనీ, పరీక్షించి తెలుసుకున్నామని అంటారు. ఈ విషయంలో ఆమె మనసుకి కష్టం కలిగించినదుకు మన్నించమని కోరతారు. దాంతో శాంతించిన సుకన్య, తన భర్త అయిన చ్యవన మహర్షికి వారిని పరిచయం చేస్తుంది.


More Bhakti Articles
Telugu News
Covid third wave likely this month may peak in October
బీ కేర్‌ఫుల్! ఈ నెలలోనే మూడో ఉద్ధృతి.. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక
41 seconds ago
Sai Pallavi signs a Tamil film
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
12 minutes ago
Amara Raja Group to shift its plant to Tamilnadu from AP
ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనున్న ‘అమరరాజా’!
24 minutes ago
Rotavac 5D Bharat Biotechs rotavirus vaccine receives Prequalification from WHO
భారత బయోటెక్ రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
54 minutes ago
BJP leader Lakshman comments
రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల జలజగడం: బీజేపీ నేత లక్ష్మణ్
9 hours ago
BJP delegation under Somu Veerraju will leave for Delhi tomorrow
సోము వీర్రాజు నేతృత్వంలో ఢిల్లీ వెళుతున్న ఏపీ బీజేపీ బృందం
9 hours ago
Indian student died in China versity
చైనా వర్సిటీలో బీహార్ విద్యార్థి మృతి
9 hours ago
Pawan and Rana starring remake release date confirmed
పవన్, రానా చిత్రం రిలీజ్ డేట్ ఖరారు
10 hours ago
Babul Supriyo says he will continue as MP
ఎంపీగా కొనసాగుతా: మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
10 hours ago
MAA President Naresh responds to Nagababu comments
నాగబాబు వ్యాఖ్యలు చాలా బాధించాయి: 'మా' అధ్యక్షుడు నరేశ్
10 hours ago