ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రిజిస్టర్ పోస్ట్ లో ఎటువంటివి పంపుకోవచ్చు?

Sat, Mar 19, 2016, 11:01 AM
Related Image

పాలా విభాగం ద్వారా రిజిస్టర్ పోస్ట్ బుక్ చేసుకుంటే... బుకింగ్ దగ్గర్నుంచి డెలివరీ వరకు అన్ని దశల్లోనూ వివరాలను నమోదు చేస్తారు. రవాణా విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటి ద్వారా అన్నీ పంపుకోలేము. కొన్నింటిని మాత్రమే రిజిష్టర్ పోస్ట్ ద్వారా పంపుకునే సౌలభ్యం వుంది. 

లెటర్లు, లెటర్ కార్డులు, పోస్ట్ కార్డులు, ప్యాకెట్లు, లిటరేచర్ ప్యాకెట్లు, పార్సిళ్లు, న్యూస్ పేపర్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు.  అలాగే 4 కిలోగ్రాముల పైబడి బరువున్న పార్సిళ్లు, ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆర్టికల్... కస్టమర్ ధ్రువీకరణ అవసరమైన పార్సిళ్లకు రిజిష్టర్ పోస్ట్ తప్పనిసరి. అలాగే, చెక్ లు, బ్యాంకు నోటీసులు మొదలైన వాటిని తప్పనిసరిగా రిజిస్టర్ పోస్ట్ లోనే పంపుకోవాలి. 

అన్నిరకాల ఆర్టికల్స్ ను రిజిస్టర్ పోస్ట్ చేయడానికి వీల్లేదు. లెటర్ అయితే 2 కిలో గ్రాములకు మించరాదు. అదే పార్సిల్ అయితే 10 కిలో గ్రాములకు మించి బరువు ఉండరాదు. పార్సిల్ ప్యాకింగ్ బలంగా ఉండాలి.  బీమాతో కూడన లెటర్లు, పార్సిళ్లు బ్రాంచ్ పోస్టాఫీసులో అయితే 600 రూపాయలు..  ఇతర పోస్ట్ ఆఫీసుల్లో లక్ష రూపాయలకు మించి విలువగల వాటిని పంపుకునేందుకు అవకాశం  లేదు. 

ఎన్ని రోజుల్లో చేరుతుంది?

స్థానికంగా డెలివరీకి రెండు రోజులు; ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ నగరాల మధ్య రెండు నుంచి మూడూ రోజుల్లోపే చేరవేస్తారు. అంటే బుకింగ్ చేసిన మూడో రోజు డెలివరీ అయిపోతుంది. అదే రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రంలో వేరే ప్రాంతానికి మూడు నుంచి నాలుగు రోజుల్లోపు, మిగిలిన ప్రాంతాలకు ఐదు నుంచి ఆరు రోజులలో డెలివరీ అవుతుంది.   

ఇవి నిషేధం

అసభ్యకరమైన ప్రింట్లు, ఫొటోలు, లితోగ్రాఫ్, బుక్, కార్డ్, అసభ్యకరమైన కథనాలు వీటిని రిజిస్టర్ పోస్ట్ లో పంపడం నిషేధం. అలాగే, పేలుడు పదార్థాలు, హనికర, అసహ్యకరమైన పదార్థాలు కూడా నిషేధమే. బతికి ఉన్న ఏ జీవినా బయటకు తెలియకుండా ప్యాక్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం నేరం. రూ. 20వేలకుపైగా విలువ చేసే బంగారు ఆభరణాలు ఇతరత్రా పంపించకూడదు. 


X

Feedback Form

Your IP address: 54.166.74.94
Articles (Education)