బిఎస్ VI స్టెప్ 2 ఎమిషన్ నిబంధనలకు కట్టుబడిన కొత్త 2023 శ్రేణిని రెనో ఇండియా ప్రవేశపెట్టింది

Related image

  • గడువు కంటే ముందు బిఎస్ VI స్టెప్ 2 ఎమిషన్ నిబంధనలకు మార్పును సాధిస్తుంది
 
  • అన్ని కార్లపై ఎలెక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం (ఈఎస్‎పి), హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్‎ఎస్‎ఏ), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం (టిసిఎస్) మరియు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం (టిపిఎంఎస్) లను ప్రామాణిక ఫీచర్స్ గా చేరికతో పెరిగిన భద్రత.
 
  • ఆకర్షణీయమైన ధరలో కొత్త ఆర్‎ఎక్స్‎ఈ వేరియంట్ ప్రారంభముతో వినియోగదారులకు రెనో క్విడ్ లభ్యత మరింత పెరుగుతుంది
 
కొత్త ఢిల్లీ, ఫిబ్రవరి 2, 2023: భారతదేశములో ప్రముఖ యూరోపియన్ బ్రాండ్ రెనో, కొత్త బిఎస్ VI స్టెప్ 2 ఎమిషన్ నిబంధనలను నెరవేర్చుటకు, పర్యావరణానుకూల వాహనాల పట్ల రెనో యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ కైగర్, ట్రైబర్ మరియు క్విడ్ లతో సహా తన శ్రేణి మొత్తాన్ని అప్గ్రేడ్ చేసింది. కొత్త బిఎస్ VI స్టెప్ 2 కు కట్టుబడిన శ్రేణి మెరుగైన క్లాస్ లీడింగ్ భద్రత ఫీచర్స్ ను కూడా అందిస్తుంది.
 
బిఎస్ VI యొక్క రెండవ దశ అమలుతో, అన్ని రెనో కార్లలో స్వీయ-నిర్ధారణ పరికరము ఉంటుంది. ఈ పరికరము డ్రైవింగ్ సమయములో కాటలైటిక్ కన్వర్టర్ మరియు ఆక్సిజన్ సెన్సర్స్ వంటి ఇతర కీలక ఎమిషన్ పరికరాలతో కలిసి నిరంతరంగా వాహనము యొక్క ఎమిషన్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది.
 
వెంకటరాం మామిళ్ళపల్లె, కంట్రి సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్, రెనో ఇండియా ఆపరేషన్స్ ప్రకారము, “పరిశుభ్రమైన మరియు పచ్చని పర్యావరణము కొరకు భారత ప్రభుత్వము యొక్క స్వప్నానికి రెనో ఇండియా కట్టుబడి ఉంటుంది. కొత్త బిఎస్VI స్టెప్ 2 అనుగుణంగా పెట్రోల్ ఇంజన్ల శ్రేణి ప్రారంభము ఎమిషన్స్ లో గణనీయమైన తగ్గుదలను నిర్ధారిస్తుంది, తద్వారా సురక్షితమైన మరియు పరిశుభ్రమైన పర్యావరణానికి తోడ్పడుతుంది.”
 
“భద్రత మాకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది మరియు మా కొత్త 2023 శ్రేణిలో ఈ కొత్త క్లాస్ లీడింగ్ భద్రత ఫీచర్స్ పరిచయము, అత్యధిక ప్రపంచ ప్రమాణాలతో భద్రతను అందించగలిగే ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రావాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.” అని ఆయన చేర్చారు.

       రెనో వారి ప్రముఖ ఉత్పత్తులు – కైగర్, ట్రైబర్ మరియు క్విడ్, అప్గ్రేడ్ లో భాగంగా ప్రవేశపెట్టబడిన క్లాస్ లీడింగ్ భద్రతా ఫీచర్స్ ను గొప్పగా తెలుపుతాయి. అగ్రగామి ప్రపంచ కార్ మూల్యాంకన కార్యక్రమము అయిన గ్లోబల్ ఎన్‎సిఏపి ద్వారా ప్రదానం చేయబడిన అడల్ట్ ఆక్యుపెంట్ కొరకు 4-స్టార్ భద్రతా రేటింగ్ తో రెనో కైగర్ మరియు ట్రైబర్ రెండు భద్రతలో బెంచ్ మార్క్ లను సెట్ చేస్తాయి. రెనో కైగర్ గొప్ప పనితీరును మరియు స్పోర్టీ డ్రైవ్ ను అందిస్తే, రెనో ట్రైబర్ అత్యున్నత నాణ్యత, మాడ్యులారిటి మరియు ఉత్తమ వాల్యూ ప్యాకేజింగ్ తో ఆకర్షణీయమైన ఆకృతిని అందిస్తుంది అని నిర్ణయించబడింది.
ఆపై భద్రతా అంశాన్ని అంచనావేస్తూ, మొత్తం రెనో శ్రేణి ప్రామాణిక ఫీచర్స్ గా ఎలెక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం (ఈఎస్‎పి), హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్‎ఎస్‎ఏ), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం (టిసిఎస్) మరియు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం (టిపిఎంఎస్) కలిగి ఉన్నాయి. ఈఎస్‎పి మరియు టిసిఎస్ ఫీచర్స్ వాహనం స్థిరత్వాన్ని అందించి ప్రమాదాల రిస్క్ ను తగ్గిస్తే, డ్రైవర్ టైర్ ప్రెషర్స్ ను నిరంతరంగా పర్యవేక్షించుటకు మరియు తదనుగుణంగా సరిచేసుకొనుటకు టిపిఎంఎస్ అనుమతిస్తుంది, తద్వారా రోడ్ భద్రత మరియు సామర్థ్యము పెరుగుతుంది. నిర్దిష్టా క్విడ్ వేరియంట్స్ తో కలిసి కైగర్ మరియు ట్రైబర్ శ్రేణిలో ఉన్న హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్‎ఎస్‎ఏ)  వినియోగదారులకు సంపూర్ణ విలువను నిర్ధారిస్తుంది.
తన సమకాలీన ఎస్‎యూవి-ప్రేరేపిత ఆకృతితో రెనో క్విడ్ భారతదేశములో ప్రవేశ విభాగాన్ని పునర్నిర్వచించింది మరియు ఉత్తమ-శ్రేణి ఫీచర్స్ అందిస్తుంది మరియు యాజమాన్యము యొక్క ఆర్ధిక వ్యయాన్ని తగ్గిస్తుంది. ఎంటి వషన్ లో 1.0ఎల్ పవర్‎ట్రెయిన్ లో కొత్త ఆర్‎ఎక్స్‎ఈ వేరియంట్ పరిచయముతో క్విడ్ యొక్క విలువ ప్రతిపాదన మరింత పెరిగి, ఐఎన్‎ఆర్ 4.69 లక్షలకు అందుబాటులో ఉంటుంది. క్విడ్ శ్రేణిలో ఓఆర్‎విఎం పై టర్న్ ఇండికేటర్స్ మరియు స్టీరింగ్ పై బిగించబడిన ఆడియో & ఫోన్ కంట్రోల్స్ ఉంటాయి, ఇవి ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి.
రెనో ట్రైబర్ అన్ని వరుసలలో ఉత్తమ స్థాయి సీటింగ్ చోటును అందిస్తుంది, దీనితో 4 మీటర్ల కంటే తక్కువ దూరములో ఒకటి నుండి ఏడుమంది పెద్దవారు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది తన విభాగములో 625ఎల్ అత్యధిక బూట్ స్పేస్ కూడా అందిస్తుంది. 2023 శ్రేణిలో కొత్త సీట్ అప్హోల్స్టరీ తో కొత్త క్రోమ్ ఫినిష్ ఎక్స్‎టీరియర్ డోర్ హ్యాండిల్స్ ట్రైబర్ శ్రేణి యొక్క ఆకర్షణీయతను పెంచుతాయి.
కొత్త బిఎస్ VI స్టెప్ 2 అనుగుణమైన రెనో శ్రేణి యొక్క పంపిణీలు అన్ని రెనో అధీకృత డీలర్షిప్స్ లో ఈరోజు నుండే ప్రారంభం అయ్యాయి.
రెనో ఇండియా భారత ప్రభుత్వము యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతకు కట్టుబడి ఉంది. తన చెన్నై ఉత్పత్తి ప్లాంట్, లాజిస్టిక్స్ & సాంకేతిక కేంద్రము మరియు డిజైన్ స్టూడియోలతో రెనో ధృఢమైన స్థానిక ఉనికిపై ప్రాధాన్యత ఇచ్చింది. 2015లో ప్రవేశపెట్టబడిన మరియు 98% స్థానికతతో తయారు చేయబడిన రెనో క్విడ్, ‘మేక్ ఇన్ ఇండియా’ భావజాలాన్ని అమలుచేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ పై ధృఢమైన ఏకాగ్రతతో కొనసాగుతూ, రెనో ఇండియా 2019లో ట్రైబర్ మరియు 2021లో కైగర్ ను ప్రవేశపెట్టింది. కైగర్ మరియు ట్రైబర్ రెండు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందబడే ముందు, భారతీయ ఆకృతి, ఇంజనీరింగ్ మరియు ప్రపంచ స్థాయి తయారీ స్థామర్థ్యాలను ప్రదర్శిస్తూ, భారతీయ వినియోగదారుల కొరకు ముందుగా రూపకల్పన, అభివృద్ధి మరియు ఉత్పత్తి చేయబడ్డాయి.
 
రెనో గురించి
 
రెనో ఇండియా ప్రై. లి. రెనో ఎస్.ఏ.ఎస్. ఫ్రాన్స్ యొక్క పూర్తి యాజమాన్యము ఉన్న అనుబంధ సంస్థ. రెనో ఇండియా కార్లు వార్షికంగా 480,000 యూనిట్ల సామర్థ్యము కలిగిన చెన్నైలోని ఒరాగడం లో ఉన్న తయారీ సదుపాయములో తయారు చేయబడతాయి. రెనో ఇండియాకు సుమారు 500 అమ్మకాలు మరియు 530 సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో బెంచ్ మార్క్ అమ్మకాలు మరియు సర్వీస్ నాణ్యతతో, దేశవ్యాప్తంగా 250 వర్క్‎షాప్ ఆన్ వీల్స్ ఉన్నాయి.

More Press Releases