భారీ స్కాల‌ర్‌షిప్ ఆఫ‌ర్‌తో విద్యార్థుల‌కు యూనివ‌ర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ ఆహ్వానం

Related image

* హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ న‌గ‌రాల్లో స్పాట్ అడ్మిష‌న్లు
 
హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 22, 2023:  అమెరికాలో మూడేళ్ల ‘మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ ఇన్ లీడ‌ర్‌షిప్‌, మేనేజ్‌మెంట్ ఆఫ్ టెక్నాల‌జీ’ కోర్సు చేయాల‌నుకుంటున్న తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల విద్యార్థుల‌కు గొప్ప శుభ‌వార్త‌. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రానికి వారికి భారీ స్కాల‌ర్‌షిప్‌లు ల‌భించ‌నున్నాయి.

ఈ విభాగంలో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి యూనివ‌ర్సిటీ ఒక‌టి ఇక్క‌డ‌కే వ‌చ్చి విద్యార్థుల‌కు స్పాట్ అడ్మిష‌న్ల‌ను ఇవ్వ‌బోతోంది. తెలంగాణ విద్యార్థుల కోసం హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల‌కు విజ‌య‌వాడ‌లో బుధ‌వారం ఈ స్పాట్ అడ్మిష‌న్ల కార్య‌క్ర‌మాలుంటాయి. సుమారు 50 మంది వ‌ర‌కు విద్యార్థుల‌ను తీసుకుంటారు.

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉండే ‘ద యూనివ‌ర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ (యుడబ్ల్యుఎల్ఎ)’ హైద‌రాబాద్‌లో ఈ మంగ‌ళ‌వారం.. అంటే జ‌న‌వ‌రి 24న విద్యార్థుల‌ను చేర్చుకుంటుంది. ఒక రోజు త‌ర్వాత విజ‌య‌వాడ‌లో ఈ కార్య‌క్ర‌మం ఉండ‌నుంది.

    యుడబ్ల్యుఎల్ఎ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ రాబ‌ర్ట్ డ‌బ్ల్యు.బ్రౌన్, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ మ‌రియు చీఫ్ స్ట్రాట‌జిక్ ఆఫీస‌ర్ అయిన డాక్ట‌ర్ టాల‌న్ బ్రౌన్ స్వ‌యంగా వ‌చ్చి భార‌తీయ విద్యార్థుల‌ను స్క్రీనింగ్ చేసి వారిని చేర్చుకోవ‌డం ఇందులో మ‌రో విశేషం.

1966లో స్థాపించిన యుడబ్ల్యుఎల్ఎ అత్యున్న‌త నాణ్య‌త‌తో, అందుబాటులో ఉండే ఫీజుల‌తో, చాలా సౌల‌భ్యంగా ఉండే విద్యావిధానంతో అంత‌ర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన ఉన్న‌త విద్యాసంస్థ‌.

గూగుల్, అమెజాన్ లాంటి ఐటీ దిగ్గ‌జాల కార్యాల‌యాల‌కు అత్యంత స‌మీపంలో ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న ఈ విద్యాసంస్థ 8వేల డాల‌ర్ల వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. మొత్తం మాస్టర్స్ కోర్సుకు 24,500 డాల‌ర్ల ఖ‌ర్చయితే, అందులో మొత్తం 16,500 డాలర్ల ట్యూష‌న్ ఫీజులో ఈ మొత్తం త‌గ్గుతుంది! నిపుణులైన బోధ‌నా సిబ్బంది, మంచి వాతావ‌ర‌ణం ఉండ‌టంతో పాటు.. ఇక్క‌డి యుడబ్ల్యుఎల్ఎ విద్యార్థి సంఘంలో వైవిధ్యం, జాతి, ఉద్యోగావ‌కాశం, జీవిత అనుభవాలు, కెరీర్ లక్ష్యాలను సాధించడంలో గొప్పతనం అన్నీ ఉంటాయి.

More Press Releases