బ్లడ్ క్యాన్సర్ రోగిని కాపాడిన హైదరాబాద్ యువత, స్టెమ్ సెల్ దాతలుగా నమోదు చేసుకోవాలని ఇతరులకు ప్రోత్సాహం

Related image

హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2022: హైదరాబాద్‌కు చెందిన రిజ్వాన్ ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక రోగిని రక్షించడానికి తన రక్త మూలకణాలను దానం చేశాడు. 2016లో DKMS BMST ఫౌండేషన్ ఇండియా ద్వారా హైదరాబాద్‌లో నిర్వహించిన దాతల రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లో అతను సంభావ్య రక్త మూలకణాల దాతగా రిజిస్టర్ చేసుకున్నాడు. 

 రిజ్వాన్ తన అనుభవాన్ని వివరిస్తూ, "మనిషిగా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుకు రావాలి, నేను ఒక జీవితాన్ని రక్షించడంలో సహాయపడగలిగానని భావిస్తున్నాను. DKMS-BMST నన్ను సంప్రదించినప్పుడు, నా జీవితం అవసరంలో ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావించాను.  బ్లడ్ స్టెమ్ సెల్ డొనేషన్ అనేది బ్లడ్ ప్లేట్ లెట్ డొనేషన్ తరహాలోనే ఉంటుంది, ఇది పూర్తి కావడానికి సుమారు 4 గంటలు పట్టే ఒక సరళమైన ప్రక్రియ. ఆరోగ్యకరమైన వ్యక్తులుగా మనం… ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందే అదృష్టం లేనివారికి సహాయం చేయడానికి ఇది ఒక అవకాశంగా పరిగణించాలి. స్టెమ్ సెల్ డొనేషన్ ద్వారా బ్లడ్ క్యాన్సర్, డిజార్డర్ రోగుల ప్రాణాలను కాపాడటానికి మనమందరం తోడ్పడడానికి పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలని నేను ప్రజలను కోరుతున్నాను. ’’ అని అన్నారు. 

రిజ్వాన్ రక్త క్యాన్సర్ రోగి పట్ల ఆదర్శవంతమైన కరుణను చూపించాడు మరియు అతని మూలకణాలను దానం చేయడానికి వెంటనే అంగీకరించాడు. ప్రారంభంలో, కుటుంబం నుండి కొంత ప్రతిఘటన వచ్చింది, కానీ చివరికి రిజ్వాన్ సంకల్పం విజయం సాధించింది, అతను మంచి కారణం గురించి తన కుటుంబాన్ని ఒప్పించాడు. 

నేడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3000 మందికి పైగా DKMS-BMST స్టెమ్ సెల్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకున్నారు. భారతదేశం నలుమూలల నుంచి 70,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఫౌండేషన్ భారతదేశం అంతటా గత మూడు సంవత్సరాలలో 70 రక్త మూలకణాల మార్పిడిని సులభతరం చేసింది. 

DKMS-BMST ఫౌండేషన్ ఇండియా సీఈఓ పాట్రిక్ పాల్ మాట్లాడుతూ, "భారతదేశంలో, ప్రతి సంవత్సరం, రక్త క్యాన్సర్, రక్త రుగ్మతలకు సంబంధించి దాదాపు లక్ష కొత్త కేసులను మేం చూస్తున్నాము. ఈ భారీ భారం ఉన్నప్పటికీ, స్టెమ్ సెల్ రిజిస్ట్రీలలో నమోదు చేసుకున్న భారతీయుల సంఖ్య అనేక ఇతర దేశాలతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంది. దాత యొక్క హెచ్‌ఎల్‌ఎ రకం రోగికి సరిపోలినప్పుడు మాత్రమే స్టెమ్ సెల్‌ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రోగులలో కేవలం 30% మందికి మాత్రమే తోబుట్టువుల మూలకణాల రకం సరిపోలుతుంది. మిగిలిన 70% మంది తమకు సంబంధం లేని దాతను కనుగొనడంపై ఆధారపడతారు. ఒకే జాతికి చెందిన దాత నుండి ఖచ్చితమైన జతను కనుగొనే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు, భారతీయ రిజిస్ట్రీలలో సంభావ్య దాతలు లేకపోవడం వల్ల భారతీయ జాతికి చెందిన రోగులు సరిపోలే దాతను కనుగొనడం కష్టంగా ఉంది. అందువల్ల, రిజ్వాన్ వంటి యువకులు ముందుకు వచ్చి సంభావ్య దాతగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని కోరారు.

భారతదేశంలో, రక్త మూలకణాల మార్పిడి  అన్నది ప్రాణరక్షక చికిత్సా విధానం అని తెలిసిన వ్యక్తుల శాతం చాలా తక్కువగా ఉంది.  కొంతమందికి స్టెమ్ సెల్ మార్పిడి అవసరమైనప్పుడు, ఒకే జాతికి చెందిన వ్యక్తుల మధ్య మ్యాచ్‌ను కనుగొనే యత్నం ఎక్కువగా ఉంటుంది. భారతీయ రిజిస్ట్రీ గనక పెద్దస్థాయిలో దాతల రిజిస్ట్రీని కలిగి ఉంటే భారతీయ రోగుల కోసం, ఈ చికిత్సా విధానం నుంచి ప్రయోజనం పొందగల మరింత మంది వ్యక్తులు జన్యు మ్యాచ్‌లను కనుగొనడానికి అవకాశముంటుంది. వరల్డ్ మ్యారో డోనర్ అసోసియేషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్లకు పైగా దాతలు నమోదు చేసుకున్నారు మరియు వీరిలో 0.5 మిలియన్ల మంది మాత్రమే భారతదేశానికి చెందినవారు. భారతదేశం వైవిధ్యభరితమైన జాతిని కలిగి ఉన్న పురాతన జనాభా, కాబట్టి విభిన్న జాతుల నేపథ్యం నుండి ఎక్కువ మంది ప్రజలు స్టెమ్ సెల్ దాతగా నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం చాలా ముఖ్యం. 

రిజిస్ట్రేషన్ ప్రక్రియ:

18-50 ఏళ్ల మధ్య వయస్సు గల ఆసక్తిగలవారు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు: dkms-bmst.org/register

దీనికి పట్టేది ఐదు నిమిషాల సమయం సరళమైన 3 దశల ప్రక్రియ:

స్టెప్ 1: సైట్‌ని సందర్శించండి, ఆన్ లైన్ ఫారమ్‌ని నింపండి, మీరు ఇంటి వద్ద DIY స్వాబ్ కిట్ అందుకుంటారు.

స్టెప్ 2: మీరు స్వాబ్ కిట్ అందుకున్న తరువాత, సమ్మతి పత్రాన్ని నింపండి, కిట్లో ఇవ్వబడ్డ 3 కాటన్ స్వాబ్‌లతో మీ బుగ్గల లోపలి నుంచి కణజాల నమూనాను తీసుకోండి.

స్టెప్ 3: మీ స్వాబ్ శాంపిల్‌ని ఇవ్వబడ్డ ప్రీ పెయిడ్ ఎన్వలప్‌లో తిరిగి పంపండి.

DKMS ప్రయోగశాల తరువాత మీ కణజాల రకాన్ని విశ్లేషిస్తుంది, రక్త మూలకణాల దాతల కోసం గ్లోబల్ సెర్చ్‌లో మీ వివరాలు లభ్యం అవుతాయి. మీరు తగిన దాతగా ముందుకు వస్తే, DKMS-BMST నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తుంది. పెరిఫెరల్ బ్లడ్ స్టెమ్ సెల్ కలెక్షన్ ప్రక్రియ ద్వారా మీ రక్త మూలకణాలు రక్తప్రవాహం నుంచి సేకరించబడతాయి, ఇది రక్తఫలకిక దానం వలే ఉంటుంది, దీనిలో మీ మూలకణాలు మాత్రమే తీసుకోబడతాయి. ఇది సురక్షితమైన, శస్త్రచికిత్స చేయని అవుట్ పేషెంట్ ప్రక్రియ.

DKMS BMST ఫౌండేషన్ ఇండియా గురించి

ఇది తలసీమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి రక్త క్యాన్సర్, ఇతర రక్త రుగ్మతలపై పోరాడటానికి అంకితమైన లాభాపేక్ష లేని సంస్థ. రక్త మూలకణాల మార్పిడి గురించి అవగాహన పెంపొందించడం ద్వారా మరియు సంభావ్య రక్త మూలకణాల దాతలను నమోదు చేయడం ద్వారా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా రక్త
...

More Press Releases