త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్న తెలంగాణ రాష్ట్రం

Related image


త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం ఉన్న రాష్ట్రంగా రికార్డు సృస్టించనున్న తెలంగాణ రాష్ట్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో క్రీడాలు, క్రీడాకారులను ప్రోత్సహించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రతి ఆవాసంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
*పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 19,472 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయబడుతున్నాయి*
.*ఇప్పటికే అందులో 5,602 రెండు పనులు పూర్తయ్యాయి*
*7,787 పనులు పురోగతిలో ఉన్నాయి.

*హైదరాబాద్ సెప్టెంబర్ 23.
------------------------------------
ఆట‌లు కేవ‌లం దేహ దారుఢ్యానికే కాదు. మాన‌సికోల్లాసానికి కూడా దోహ‌ద‌ప‌డ‌తాయి. ఆట‌లు ఆరోగ్య‌దాయ‌కం కూడా. అందుకే ఒక‌ప్పుడు స్కూల్స్ లో ప్ర‌తి రోజూ ఒక ఆట‌ల పీరియ‌డ్ ఉండేది. ఓ క్రాఫ్ట్ టీచ‌ర్ఉం డేవారు. ఏ టీచ‌ర్ రాక‌పోయినా, ఆ పీరియ‌డ్ ఆట‌ల‌కే అంకిత‌మ‌య్యేది. ఆట‌లు అంటే అంత ప్రాముఖ్య‌త ఉండేది. అంతేనా! స్కూల్ చుట్టీ బెల్కొ ట్టారంటే చాలు... పుస్త‌కాలు గ్రౌండ్ లోనే ఓ మూల‌న ప‌డేసి... చీక‌టి ప‌డేదాకా... న‌చ్చిన ఆట‌లు ఇష్టానుసారంగా ఆడుకునేవాళ్ళం అని చాలా మంది తమ పిల్లలకు చెప్తారు. అందునా గ్రామములోని యువకులు , ఔత్సాహిక క్రీడాకారుల‌నేక మంది, టీచ‌ర్స్‌, పోలీస్‌... ఇలా అనేక వ‌ర్గాల వాళ్ళు వ‌చ్చి అదే గ్రౌండ్ లో ఆడే ఆట పాట‌ల‌తో ఎల్లప్పుడూ సందడిగా కనిపించేది . విద్యార్థులు పొద్దున్నే గ్రౌండ్ కి వెళ్ళి... పి.ఇ.టి. సార్ఇ చ్చే శిక్ష‌ణ‌, వామ‌ప్ వంటివి చేసేవారు.. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి లాంటి గ్రామంలో ఓ పీఇటి ఇచ్చిన శిక్ష‌ణ వెంక‌ట‌నారాయ‌ణ లాంటి అనేక మంది అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌నే త‌యారు చేసింది. చిన్న‌ప్ప‌టి నుండే అందే శిక్ష‌ణ అంత గొప్ప విజ‌యాల‌ను అందించింది. అందుకే గ్రామీణ క్రీడ‌లకు త‌గిన ప్రోత్సాహం ఇస్తూనే, గ్రామీణ క్రీడాకారుల‌ను గొప్ప‌గా తీర్చిదిద్దే ప‌నిని రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఒక విధానంగా పెట్టుకుంది. కేవ‌లం ఒక చోట శిక్ష‌ణ ఇచ్చే మూస ప‌ద్ధ‌తిని కాద‌ని, ప్ర‌తి ఆవాసానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారు శ్రీ‌కారం చుట్టారు. 
       ప్ర‌తి ఆవాసంలో క‌నీసం ఒక ఎక‌రా స్థ‌లానికి త‌గ్గ‌కుండా సేక‌రించి, అందులో క్రీడా మైదానాన్ని అభివృద్ధి ప‌రిచారు. అలాగే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వార్డు, న‌గ‌ర ప్రాంతాల్లో డివిజ‌న్ల‌లో క‌నీసం ఒక క్రీడా ప్రాంగ‌ణాన్ని ఏర్పాటు చేయాల‌ని సిఎం కెసిఆర్ నిర్దేశించారు. ఆ క్రీడా ప్రాంగ‌ణాల్లో ఖోఖో, క‌బ‌డ్డీ, వాలీబాల్‌, లాంగ్ జంప్ పిట్‌, ఎక్స‌ర్ సైజ్ బార్ వంటి ప‌రిక‌రాల‌ను కూడా అమర్చుచున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 19,472 క్రీడా ప్రాంగ‌ణాల‌ను ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించారు. మొత్తం 13,418 ప్రాంతాల్లో అనువైన స్థ‌లాల‌ను ఇప్ప‌టికే గుర్తించారు. వీటిలో 10,451 గ్రామ పంచాయ‌తీల్లో, 2,967 ఆవాసాల్లో క్రీడా ప్రాంగ‌ణాల‌ను ఏర్పాటు చేయబడుతున్నాయి ఇప్పటివరకు 5,602 పనులు పూర్త‌య్యాయి. 7,787 ప‌నులు కొన‌సాగుతున్నాయి. మిగతా పనులు వివిధ దశలలో ఉన్నాయి. క్రీడ‌ల‌ను, క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు విద్యార్థులు, యువ‌కులు ఆరోగ్యంగా, హాయిగా ఉండేందుకు వీలుగా ఈ క్రీడా ప్రాంగ‌ణాలు ఉప‌యోగ‌ప‌డాల‌ని సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారు. స‌రిగ్గా ఈ ఫ‌లితాలు సాధించేందుకు క్రీడా ప్రాంగ‌ణాలు దోహ‌దం చేయాల‌ని, జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్త‌మ క్రీడాకారులు మ‌న రాష్ట్రం నుండే త‌యార‌వ్వాల‌ని ఆశిద్దాం.

   ------------------------------------------------------------------------------------------------------------------------శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్జా రీచేయనైనది.

More Press Releases