రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడెంలు, తండాలకు త్రీఫెస్ విద్యుత్ సరఫరా - సి.ఎస్. సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, సెప్టెంబర్ 17 :: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడెంలు, తండాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమై త్రి ఫెస్వి ద్యుత్ ను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, ఆదివాసీ, గిరిజన ఆత్మీయ సభ లో స్వాగతోపన్యాసం సి.ఎస్సో మేశ్ కుమార్ చేశారు. ఈ సందర్బంగా సోమేశ్ కుమార్మా ట్లాడుతూ, రాష్ట్రంలో 2014 కు ముందు కేవలం 91 గిరిజన గురుకులాలు మాత్రమే ఉండేవని వాటిని ప్రస్తుతం 183 కు పెంచడం జరిగిందని తెలిపారు. వివిధ విద్య సంస్థలకు చెందిన 918 గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి ప్రముఖ సంస్థల్లో చేరారని పేర్కొన్నారు. గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధిని 2017 లో సి.ఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని,  దీనిద్వారా గిరిజన జనాభా ప్రకారం నిధులను కేటాయిస్తున్నామనివెల్లడించారు.రాష్ట్రంలోని ప్రతి గీరిజన గూడాన్ని, తండాను గ్రామ పంచాయతీగా మార్చామని, దీనిలో భాగంగా రాష్ట్రంలో 2471 కొత్త గ్రామ పంచాయితీలను
 ఏర్పాటు చేశామని సి.ఎస్ వివరించారు.

More Press Releases