ఆదివాసీ, గిరిజనుల సంక్షేమo, అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Related image

ప్రచురణార్ధం 

హైదరాబాద్:14 సెప్టెంబర్,2022.
----------------------------------------------
*ఆదివాసీ, గిరిజనుల సంక్షేమo, అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

*హైదరాబాద్ లో రూ.24 కోట్ల 68 లక్షలతో నిర్మించిన కుమ్రo భీమ్ ఆదివాసీ భవన్, రూ.24 కోట్ల 43 లక్షలతో నిర్మించిన సేవాలాల్ బంజారా భవనాలను ఈ నెల 17 న ప్రారంబించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

*తెలంగాణలో ఘనంగా ఆదివాసీ, గిరిజన జాతరలు

*ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబాలుగా మ్యూజియంల ఏర్పాటు

*రాష్ట్రవ్యాప్తంగా రూ.75 కోట్ల 86 లక్షలతో 32 ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించిన ప్రభుత్వం
ఆదివాసీ, గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది.

    ఘనంగా ఆదివాసీ గిరిజన జాతరలు ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ల  జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన, ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క -సారలమ్మ జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నది. వీటితో పాటు నాగోభా జాతర, జంగుబాయి జాతర, బౌరoపూర్ జాతర, ఎరుకల నాంచారమ్మ జాతర, గాంధారి మైసమ్మ, తదితర జాతరలను అధికారికంగా నిర్వహిస్తున్నది.సమ్మక్క- సారలమ్మ జాతర తో పాటు ఇతర ఆదివాసీ గిరిజన జాతరల నిర్వహణ, వసతుల కల్పనకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత ఎనిమిది ఏండ్లలో ప్రభుత్వం రూ.354 కోట్లను ఖర్చుచేసింది.

     ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబాలుగా మ్యూజియంల ఏర్పాటు

ఆదివాసి హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీమ్ స్మారక కేంద్రాన్ని జోడేఘాట్ వద్ద ప్రభుత్వం నెలకొల్పింది నూతనంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాగా ప్రభుత్వం పేరు పెట్టింది. అలాగే మేడారం వద్ద కోయ గిరిజన తెగ సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా సమ్మక్క -సారలమ్మ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.మ్యూజియం ల ఏర్పాటుకు ప్రభుత్వం మొత్తం రూ.22 కోట్ల 53 లక్షలను ఖర్చు చేసింది.

     ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా ప్రత్యేక భవనాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రూ.24 కోట్ల 68 లక్షల వ్యయంతో కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్ ను, రూ.24.43 కోట్ల వ్యయంతో సేవాలాల్ బంజారా భవన్ లను ఆధునిక వసతులతో ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆత్మగౌరవ భవనాలను ఈ నెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించ నున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ.75 కోట్ల 86 లక్షల వ్యయంతో 32 ఆదివాసీ, బంజారా భవనాలను ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లో 3, పూర్వ జిల్లా కేంద్రాల్లో 10, ఐ టి డి. ఏ లు ఉన్న 3 చోట్లతో పాటు 12 ఎస్టీ నియోజకవర్గం కేంద్రాల్లో ఈ భవనాలు ఉన్నాయి.( జాబితా జత చేయనైనది)
---------------------------------------------------------------------------------------------------------------------
-శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ చే జారిచేయనైనది

More Press Releases