సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటు: మంత్రి తలసాని

Related image

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీ హాస్పిటల్ ప్రధాన గేట్ ముందు భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి గాంధీ హాస్పిటల్ వద్ద పరిశీలించారు. 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు గార్డెనింగ్, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో  చేపడుతున్నట్లు తెలిపారు. 

HMDA అధికారులు మంత్రికి అభివృద్ధి పనుల నమూనాను ద్వారా వివరించారు. ముందుగా బన్సీలాల్ పేట మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందనున్నదని చెప్పారు. నిజాం కాలంనాటి మెట్లబావి పునరుద్ధరణ, ఈప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు కూడా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

బావి పరిసరాలలో ని భవనాలు అన్నింటికీ ఒకే రకమైన కలర్ వేయడం జరుగుతుందని, దీంతో ఈ ప్రాంత ఆకర్షణీయంగా కనిపిస్తుందని వివరించారు. స్థానిక ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, EE సుదర్శన్, ఎలెక్ట్రికల్ DE శ్రీధర్, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి తదితరులు ఉన్నారు.

More Press Releases