15వ డివిజన్ నందలి పలు వీధులలో పారిశుధ్య పనుల పరిశీలించిన వీఎంసీ కమిషనర్

Related image

విజ‌య‌వాడ‌ తూర్పు నియోజకవర్గ 15 వ డివిజన్ సర్కిల్-3 పరిధిలో గల రామలింగేశ్వర నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు.

పారిశుధ్య నిర్వహణకు సంబందించి ప్రధాన రహదారులలో మరియు అంతర్గత రోడ్ల యందు ఎక్కడ డంపర్ బీన్స్ నిల్వ ఉండకుండా ప్రతి నిత్యం తొలగించుట మరియు సైడ్ డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా ప్రవహించేలా చూడలని నీటి ప్రవాహనమునకు అడ్డంకిగా ఉన్న వ్యర్దాములను తొలగించి డ్రెయిన్స్ నందు మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా రిటైనింగ్ వాల్ దగ్గర, రుద్రభూమి వెనుక వైపు లో ఉన్న ఖాళీస్థలం ఉండటం వలన స్థానిక ప్రజలు చెత్తను పరవేయటం జరుగుతుంది కాబట్టి అక్కడ 5 అడుగుల మేరకు కాంపోండ్ వాల్ ను నిర్మాణం చేపట్టామని  పలు ఆదేశాలు ఇచ్చారు. సాయిరామ్ కట్ పిసెస్ దగ్గర నుండి రుద్రభూమి వరకు అవుట్ ఫాల్ డ్రెయిన్ ను నిర్మించమని, రిటైనింగ్ వాల్ నుంచి 60 అడుగుల దూరంలో రోడ్డును వేసి డ్రైనేజిని కుడా నిర్మించమని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

తదుపరి సర్కిల్-3 పరిధిలో గల నాగార్జుననగర్ లో ఇంజనీరింగ్ వర్క్స్ పర్యవేక్షించి రోడ్డుపై వేసిన కొబ్బరి బొండాలను తీసివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పలు వీధుల్లో  విధులు నిర్వహిస్తున్న డ్వాక్రా వర్కర్ల మచ్చర్లను పరిశీలించారు.

తదుపరి బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు వరకు గల జాతీయ రహదారి నందలి గ్రీన్ బెల్ట్  మరియు సెంట్రల్ డివైడర్ లలో మొక్కలను పరిశీలించి సెంట్రల్ డివైడర్ నందలి ఖాళీగా ఉన్న చోట్ల మొక్కలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించాలని మరియు ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుటతో పాటుగా పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఉండునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు.

పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్ హెల్త్ గా డా. పి.రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్రశేఖర్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases