నిజామాబాద్ లో మొట్టమొదటి మరియు అతిపెద్ద మల్టీప్లెక్స్ ని PVR ప్రారంభిస్తోంది

Related image

నేషనల్, 12 ఆగస్టు 2022: ఇండియా లోని అతిపెద్ద సినిమా ప్రదర్శన కంపెనీ అయిన PVR సినిమాస్, ఈ రోజున తెలంగాణ, నిజామాబాద్ లోని వేణు మాల్ వద్ద తన మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఆవిష్కరణను ప్రకటించింది. అతిప్రధానమైన మార్కెట్ల వ్యాప్తంగా తన ఉనికిని బలోపేతం చేసుకుంటూ, కొత్తగా తెరవబడిన 4-స్క్రీన్ల భవంతి అత్యుత్తమ శ్రేణి థియేటర్ సంబంధిత పరిష్కారాలతో సమ్మిళితమై మరియు లీనమైపోయే మరియు నిరంతరాయ సినిమా అనుభూతిని అందించడానికి గాను వ్యక్తిగతీకృతమైన ఆతిథ్య సేవలను అందించబోతోంది.

ఈ ప్రారంభముతో, PVR సినిమాస్ తెలంగాణలో 13 ప్రాపర్టీలలో 71 స్క్రీన్‌లు, మరియు దక్షిణ భారతదేశములో 49 ప్రాపర్టీల వ్యాప్తంగా 299 స్క్రీన్లతో తన పాదముద్రను బలోపేతం చేసుకొంది. 

హైదరాబాద్ కు వాయువ్య దిశగా సుమారు 175 కిలోమీటర్ల దూరములో నెలకొని ఉన్న ఈ క్రొత్త ప్రాపర్టీ మొత్తం 1212 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యమును కలిగి ఉంది మరియు నిజామాబాదు లోనికి మొట్టమొదటి జాతీయ మల్టీప్లెక్స్ చైన్ యొక్క ప్రవేశానికి నాంది అవుతోంది.

అసమానమైన గ్రాహ్యతను అందుకుంటూ మరియు లీనమైపోయే అనుభూతిని అందించడానికి గాను, ఈ 4-స్క్రీన్ల ప్రాపర్టీ, 2K ప్రొజెక్టర్లు, తర్వాతి-తరం 3డి స్క్రీన్లు మరియు డాల్బీ అట్మోస్ ధ్వనితో సహా అత్యాధునికమైన చలనచిత్ర సంబంధిత టెక్నాలజీలతో సుసంపన్నమై ఉంది.

ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ, PVR లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ సంజీవ్ కుమార్ బిజిలీ గారు, ఇలా అన్నారు, “దక్షిణ భారతదేశం చలనచిత్ర సంస్కృతికి ఒక బలమైన పునాది కలిగి ఉంది మరియు ప్రకంపనాయుత సినీ పరిశ్రమ యొక్క నేపధ్యములో విస్తరణకు గొప్ప అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో సినిమాలు చూడాలనే వాంఛ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల, ప్రేక్షకులలో హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల పట్ల విస్తృతమైన స్వీకారం ఉంది.  నిజామాబాద్ లోనికి మా ప్రవేశము, టయర్-2 మరియు టయర్-3 నగరాలలో స్థానిక ప్రజానీకానికి అత్యుత్తమ శ్రేణి వినోద సౌకర్యాలను అందించడానికి మరియు సినిమాకు వెళ్ళే అనుభవాన్ని పెంపొందించడానికై కంపెనీ తన ఉనికిని  పెంచుకోవాలనే వ్యూహానికి అనుగుణంగా రూపుదిద్దుకోబడింది” అన్నారు.

ముందు భాగములో అత్యద్భుతమైన షాన్డిలియర్లతో దృశ్యాత్మకంగా మిరుమిట్లు గొలిపే ఇంటీరియర్, ‘V’ ఆకారపు డివిడి కళాకృతులతో ధ్వని వినిపించే గోడలపై అరుణ వస్త్రపు ప్యానల్స్ కలిగియుండి, ఈ సినిమా సాదరపూర్వకమైన మరియు స్వాగతధోరణితో కూడిన చక్కదనమును కలిగి అన్ని గొప్ప చలనచిత్రాల పట్ల వైభవోపేతమైన అనుభూతిని కలిగించేలా ఉంటుంది.  దీనికి అదనంగా, సౌకర్యవంతమైన రిక్లైనర్లలో వడ్డించబడే షడ్రసోపేతమైన విస్తృత శ్రేణి విందు పదార్థాలు తదుపరిగా ప్రాపర్టీ యొక్క విశిష్ట అందజేతలకు జోడింపును ఇస్తాయి. 

‘’దేశము యొక్క ప్రతి భాగానికీ ప్రపంచ-స్థాయి సినిమా వీక్షణ అనుభూతిని తీసుకు రావడానికై మా కృషిని కొనసాగిస్తూ, నిజామాబాదులో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ప్రాపర్టీని తీసుకు రావడం పట్ల మేము ఎంతగానో గర్విస్తున్నాము.  ఈ కొత్త మల్టీప్లెక్స్, డాల్బీ అట్మోస్ లీనమయ్యే ధ్వని అనుభవముతో పాటుగా అన్ని ఆడిటోరియముల లోనూ రిక్లైనర్లను కలిగి ఉండి, నగరములో ఈ తరహాలోని మొట్టమొదటి థియేటరుగా ఉంటుంది.  పోషకులు PVR యొక్క సర్వశ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారని మేము నిశ్చయముతో ఉన్నాము.’’ అన్నారు, PVR లిమిటెడ్ సిఇఓ శ్రీ గౌతమ్ దత్తా గారు. ఆర్థిక సంవత్సరం'23 లో 120-125 స్క్రీన్లను జోడించడానికి ప్రణాళిక చేస్తుండడం వల్ల PVR లో స్క్రీన్ జోడింపుపై ఒక బలమైన ప్రేరణ ఉంది.  ఈ ప్రారంభముతో, ఆర్థిక సంవత్సరం 2022-23 లో 76 నగరాలలో (ఇండియా మరియు శ్రీలంక) 174 ప్రాపర్టీలలో 858 స్క్రీన్లతో PVR తన ఎదుగుదల ఊపును బలోపేతం చేసుకుంటోంది.  

More Press Releases