మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమిష్టి కృషి: సునీతాలక్ష్మారెడ్డి

Related image

• అక్రమ రావాణా అరికట్టేందుకు తెలంగాణలో ప్రత్యేక చర్యలు
• రాష్ట్ర వ్యాప్తంగా మూడో శనివారం ఐసీడీస్ పరిధిలో స్వరక్ష డే
• సమిష్టి పోరుపై ఆరు రాష్ట్రాల ఉమ్మడి ఒప్పందం
• రెండు రోజుల సదస్సులో పలు నిర్ణయాలు: ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి 
 
(బుధ్దాభవన్ – హైదరాబాద్): మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా రాష్ట్రాలు మానవ అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఉమ్మడి ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశాయి. మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షతన శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో విమెన్ ట్రాఫికింగ్ పై నిర్వహించిన సదస్సులో పలు నిర్ణయాలపై తీర్మాణాలు ఆమోదించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేసేందుకు సమిష్టిగా ముందుకు కదులుతున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం ఇదేనని చైర్ పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని చైర్ పర్సన్ తెలియజేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో ఏ.హచ్.టి.యు ఏర్పాటు చేయడమే కాకుండ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చట్టాలపై అవగాహన అవగాహణ కల్పించడంతో పాటు మహిళా కమీషన్ జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. 

పిల్లలు, మహిళలపై సైబర్ నేరాలు, ఆన్ లైన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్, షీ సైబర్ సెల్ ఏర్పాటు చేసిందని తెలిజేసారు. సాధారణ వ్యక్తులు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకోడానికి ప్రభుత్వం ధృవ పోర్టల్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అలాగే ప్రజ్వల ఎన్జీఓ తో కలిసి హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ వికల్ప ఏర్పాటు చేసిందని చైర్ పర్సన్ అన్నారు. ట్రాఫికంగ్ మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు అబ్జర్వేషన్ హోమ్స్ మరియు రెండు స్పెషల్ హోమ్స్ ఉన్నాయని అన్నారు. అలాగే ఒడిషా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం మరియు ట్రాఫికింగ్ లో గుర్తించిన వారికోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో పోలీస్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ కలిసి ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిజేశారు.

ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో స్వరక్ష డే

మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రంలో అన్ని ఐసీడీస్ ప్రాజెక్టులలో స్వరక్ష డే నిర్వహించడం జరుగుతుందని చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరిక్టేందుకు అంతర్ రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని చైర్ పర్సన్ అన్నారు. అంతర్ రాష్ట్ర మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం  మొదటి స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్ రాష్ట్ర అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. అలాగే మహిళల రక్షణ, గౌరవం, సాధికారత పై అందరం సమిష్టిగా కృషి చేయాలని చైర్ పర్సన్ అన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా చిన్నారులు, మహిళల పై అక్రమ రవాణా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనిమానవ అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు 100, మహిళా హెల్ప్‌లైన్‌ 181, మహిళా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533, 1098 చైల్డ్‌ లైన్‌కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చన్నారు.
 
ఈ రెండు రోజుల సదస్సులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరజన్ మరియు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, ఒడిశా మరియు తమిళనాడు రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్ పర్సన్స్, శిశు, సంక్షేమ శాఖల కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases