పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమ నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

Related image

  • పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమ నిర్వహణపై జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీ సీఈవోలతో సన్నాహక సమీక్ష
  • సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్: రాజేంద్ర నగర్ లోని టీఎస్ఐఆర్డీలో జరిగిన సమీక్ష పల్లె ప్రగతి అద్భుతమైన కార్యక్రమం అంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వంద శాతం పని చేస్తామని హామీ ఇస్తూ,జెడ్పీ చైర్మన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

నిజామాబాద్, నల్గొండ, వనపర్తి జిల్లా జెడ్పీ చైర్మన్లు ధర్మన్న గారి విఠల్ రావు, బండా నరేందర్ రెడ్డి, లోక నాథ రెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగా రెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీం నగర్, జగిత్యాల, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల జెడ్పీ చైర్ పర్సన్ లు పట్నం సునీత, సల్గూటి స్వర్ణ లత, గండ్ర జ్యోతి, టి.అనితా రెడ్డి, న్యాల కొండ అరుణ, దపేదార్ శోభ, కనుమల్ల విజయ, దావా వసంత, కోవా లక్ష్మి, యాదాద్రి జెడ్పీ సీఈఓ తదితరులు సన్నాహక సమావేశంలో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలిపారు.

ఈ సమావేశంలో ఇప్పటివరకు నిర్వహించిన పల్లె ప్రగతి విజయాలు, వచ్చే పల్లె ప్రగతి నిర్వహణపై జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ సీఈవో లకు వివరించిన మంత్రి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని దిశా నిర్దేశం చేసిన మంత్రి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జెడ్పీ చైర్మన్లు, చైర్పర్సన్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, కమిషనర్ శరత్, ప్రత్యేక కమిషనర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓలు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లను పల్లె ప్రగతి కార్యక్రమానికి, జెడ్పీ చైర్మన్ల కు అనుసంధానం చేయాలని కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కామెంట్స్‌:
  • సీఎం గారు గొప్ప‌ నిర్ణయం తీసుకున్నారు. అద్భుత‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
  • దేశంలో మన రాష్ట్రాన్ని, మన గ్రామాలను నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కెసిఆర్ గారిది
  • దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవే. 10 కి 10 ఆదర్శ గ్రామాలు కూడా మనవే
  • పారిశుద్ధ్యంలో, ఈ పంచాయతీ లో, ఆడిటింగ్ లో మల మూత్ర విసర్జన రహిత గ్రామాల్లో, పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో మన గ్రామాలే నెంబర్ వన్ గా ఉన్నాయి
  • ఇవ‌న్నీ సిఎం కెసిఆర్ గారు పెట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి, ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన‌ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారుల శ్రమ ఫలితంగా వచ్చాయి
  • మీకు ప్రభుత్వ సహకారం అన్ని విధాలుగా పూర్తిగా ఉంది
  • 15 ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • మొత్తం గ్రాంట్ ని గ్రామ పంచాయతీలకు 85%, మండలాలకు 10%, జెడ్పీ లకు 5% నిధులను పంపిణీ చేసింది కూడా సీఎం గారే
  • స్థానిక సంస్థలకు ఇంతగా నిధులు వచ్చినది చరిత్రలో లేదు
  • అదనంగా ఉపాధి హామీలో కూడా దేశంలో మనమే అగ్రగామిగా ఉన్నాం
  • ఇదే తరుణంలో సీఎం గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు
  • పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో జెడ్పీ చైర్మన్ లు, సీఈఓ లు, ఎంపీపీ లు, ఎంపిడిఓ లు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, కలెక్టర్లు తదితరుల పాత్ర ఎంతో ఉంది. మీ అందరికీ అభినందనలు!
  • ఈ సారి పల్లె ప్రగతి కార్యక్రమం బాధ్యత పూర్తిగా జెడ్పీ చైర్మన్లు, సీఈఓ లు తీసుకోవాలని సీఎం గారు భావిస్తున్నారు
  • సన్నాహక సమావేశాలు పెట్టీ, మీ మీ జిల్లా పరిధిలోని రాష్ట్ర మంత్రుల‌ను సంప్ర‌దించి, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, సర్పంచు లు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత అంతా మీరే తీసుకోవాలి
  • జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ సీఈవో లు గ్రామాల్లో పర్యటించాలి
  • పల్లె ప్రగతి 5వ విడత మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ సారి బాధ్యత అంతా ప్రజా ప్రతినిధులదే. సమన్వయం చేసే బాధ్యతను జెడ్పీ చైర్మన్ లు, సీఈఓ లు తీసుకోవాలి
  • అధికారులు, ప్రజా ప్రతినిదులు అందరినీ సమన్వయం చేసుకోవాలి
  • ఇచ్చిన ఎజెండా ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయండి
  • సన్నాహక సమావేశాలు నిర్వహించండి
  • గ్రామాల ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి
  • ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి కమిటీలు వేయాలి. ఆ కమిటీలు ఆయా గ్రామాల అభివృద్ధి కి ప్రణాళికలు సిద్ధం చేయాలి
  • మొదటి రోజు గ్రామాల్లో పాదయాత్రలు, పల్లె ప్రగతి గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు చేయాలి
  • పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్స్, గ్రీన్ కవర్ తదితర కమిటీల ద్వారా సమస్యలు గుర్తించాలి. వాటి పరిష్కారానికి పాటు పడాలి
  • ప్రజా భవనాలు, ప్రజలు బాగా ఉండే, నడిచే ప్రదేశాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి
  • వీధులను, గ్రామాలను పరిశుభ్రంగా ఉండే పారిశుద్ధ్యం నిర్వహించాలి
  • ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి
  • బహిరంగ మల మూత్ర విసర్జన నివారణ చర్యలు చేపట్టాలి. ఆయా చోట్ల చెత్తా చెదారం లేకుండా చూడాలి
  • నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, తాజాగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  • ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి నేను రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతాను
  • మ‌న‌మంతా క‌లిసి క‌ట్టుగా ప‌ల్లె ప్ర‌గ‌తిని విజ‌య‌వంతం చేద్దాం
  • దేశంలో రాష్ట్రాన్ని ఆగ్ర‌గామిగా తీర్చిదిద్దుదాం
  • సిఎం కెసిఆర్ గారి మార్గ నిర్దేశ‌నంలో బంగారు తెలంగాణ‌ని సాధిద్దాం
 

More Press Releases