ఈనెల 20నుండి 'జీ5'లో స్ట్రీమింగ్ కానున్న ఆర్ఆర్ఆర్

Related image

  • అదనపు భారం లేని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ "ఆర్ఆర్ఆర్" వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ మీ "జీ5" లో
  • ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన "ఆర్ఆర్ఆర్" మే 20 నుండి ఉచితంగా లభిస్తుంది
"జీ5" తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది. "జీ5" ప్రారంబించిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా "జీ5" మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" 'రౌద్రం రణమ్ రుధిరం'ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ "ఆర్ఆర్ఆర్" ద్వారా "జీ5" అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

'ఆర్ఆర్ఆర్' ('రౌద్రం రణం రుధిరం') స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే..కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు.

అయితే "జీ5" టీం సాధారణ ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని, "జీ5" T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది మరియు సాధారణ చందా ఉన్న చందాదారులందరికీ 'ఆర్ఆర్ఆర్' ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

ఇప్పటికే ఉన్న "జీ5" సబ్‌స్క్రైబర్‌ లు 'ఆర్ఆర్ఆర్'ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు చేసిన అభ్యర్థనలను "జీ5" టీం పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి, స్ట్రీమింగ్ దిగ్గజం "జీ5" వారు మే 20 నుండి ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు/పెయిడ్ యూజర్‌లకు 'ఆర్ఆర్ఆర్'ని ఉచితంగా అందించనుంది.

'ఆర్ఆర్ఆర్' S-VODలో మే 20, 00:00 గంటల నుండి "జీ5" వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. రూ. 699 (ఆర్ఆర్ఆర్ ప్లస్ "జీ5" యొక్క వార్షిక చందా) చెల్లించి కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ మేము చేయింజ్ చేసిన ప్లాన్ ప్రకారం మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యేవిధంగా అందించడం జరుగుతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'ఆర్ఆర్ఆర్'. మే 20వ తేదీన 'జీ5' ఓటీటీ వేదికలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు ప్రత్యేక రోజు! అందుకే జీ5 వారు ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి "ఆర్ఆర్ఆర్" ప్రీమియర్‌ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తున్నారు. వీక్షకులు ఈ ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌ను అత్యుత్తమ 4K నాణ్యతలో మరియు డాల్బీ అట్మాస్‌తో వారి ఇళ్లలో సౌకర్యవంతంగా చూడవచ్చు.

'ఆర్ఆర్ఆర్'ని మీ ఇంటికి తీసుకురావడం ద్వారా, జీ5 మరోసారి వీక్షకులకు అత్యుత్తమ వినోదం అందించడానికి "జీ5"' కృషి చేస్తుందని మరోసారి రుజువైంది. ఇప్పుడు "జీ5 " పేరు ప్రతి ఇంట  వినబడుతోందనడంలో ఆశ్చర్యం లేదు. కేవలం దక్షిణ భారత వీక్షకులే కాదు, దక్షిణాది భాషల్లో ఏదీ తెలియని OTT వినియోగదారులు కూడా 'ఆర్ఆర్ఆర్'ని ఆంగ్ల ఉపశీర్షికలతో వీక్షించే అవకాశం ఉన్నందున ఈ వార్తలను చూసి సంతోషిస్తున్నారు.

జీ5 ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది, ప్రేక్షకులు 'ఆర్ఆర్ఆర్'ని మళ్లీ మళ్లీ చూడాలను కుంటున్నారు! మరెందుకు ఆలస్యం వెంటనే జీ5 ను సబ్క్రైబ్ చేసుకుంటే వీక్షకులకు కావాల్సినంత వినోదం ఇవ్వడం కోసం 'జీ5' రెడీ అయింది.

More Press Releases