వెహికల్ డిపో ఆవరణలో మినీ సూయేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • ప్రభుత్వం హాస్పటల్ రోడ్ నందలి ఆక్రమణలను నైట్ షెల్టర్ హోమ్ కు తరలించాలి
  • అధికారులకు కమిషనర్ ఆదేశాలు
విజయవాడ: నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అధికారులతో కలసి వెహికల్ డిపో నందు చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించి అధికారులను చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకొని పనులు సూచనలు చేశారు. ఈ సందర్భంలో డిపో ఆవరణలో శిద్దిలవ్యవస్థలో ఉన్న ఓల్డ్ కోల్డ్ స్టోరేజ్ కు సంబందించి ఇంజనీరింగ్ కాలేజీ రిపోర్ట్ ఆధారంగా దానిని తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మరియు 15వ ఆర్ధిక సంఘ నిధులతో డిపో ఆవరణలో మీని సూయేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణము చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ వద్ద ట్రాన్స్ ఫారం ఉండుట గమనించి రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దానిని అక్కడ నుండి తొలగించుటకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తదుపరి పాత ప్రభుత్వం రోడ్లో కాలవ గట్టు వెంబడి ఉన్న ఆక్రమణలను పరిశీలించి వారిని అక్కడ నుండి తరలించి నైట్ షెల్టర్ హోమ్ నకు తరలించాలని అధికారులకు సూచిస్తూ, గతంలో వారికీ ఇళ్ళు కేటాయించినది లేనిది పరిశీలించి రిపోర్ట్ సమర్పించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా వెహికల్ డిపో వెనుక భాగం కెనాల్ బండ్ నందు పెరిగిన చెట్లను ట్రిమ్మింగ్ చేయాలని సూచించారు. అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం రోడ్లలో పర్యటిస్తూ గెస్ట్ హౌస్ జంక్షన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మరియు టీటీడీ కళ్యాణ మండపం రోడ్ యందలి ఫుట్ పాత్ లో గ్రీనరి పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పర్యటనలో ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.కోటేశ్వరరావు, వెంకటేశ్వర రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డా.రామ కోటేశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases