పారిశుధ్య నిర్వహణ పట్ల విజ‌య‌వాడ‌ మేయర్ అసంతృప్తి

Related image

  • పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి, ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలి
  • 14వ శానిటరీ డివిజన్లో పర్యటించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజ‌య‌వాడ‌: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అధికారులతో కలసి 14వ శానిటరీ డివిజన్ నందలి పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డివిజన్ నందలి పారిశుధ్య సిబ్బంది యొక్క హాజరు మరియు ఎఫ్ఆర్ఎస్ మస్తరు పరిశీలించి సిబ్బంది అందరు సక్రమముగా విధులకు హాజరు అవుతున్నది లేనిది అడిగితెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో పర్యటిస్తూ, అవుట్ ఫాల్ డ్రైన్లు మరియు సైడ్ కాలువలలో మరుగునీటి పారుదల విధానము పరిశీలించగా చెత్త పేరుకుపోయి మురుగునీటి ప్రవాహం లేక అస్తవ్యస్తముగా వుండట పట్ల పారిశుధ్య నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించి మురుగునీటి ప్రవాహం సక్రమంగా పారేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇటువంటివి పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇదే సమస్య తలెత్తినచో సంబందిత శానిటరీ ఇన్స్ పెక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదే విధంగా డివిజన్ నందలి మంచినీటి సరఫరా తీరుపౌ స్థానికులను అడిగి తెలుసుకోని వేసవిలో త్రాగునీటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. పలు రోడ్లపై ఉన్న పాదచారుల మరియు ట్రాఫిక్ వ్యవస్థకు అవరోధకరంగా నిరూపయోగంగా ఉన్నబడ్డీలు మరియు వాహనములను అక్కడ నుండి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలో గల ఖాళీ ప్రదేశములో చెత్త మరియు వ్యర్ధములు ఉండుట గమనించి ప్రజారోగ్య చట్టం ప్రకారం సంబంధిత యజమానికి నోటీసులు ఇచ్చి వాటిని శుభ్రపరచునట్లుగా చూడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

లంబాడీపేట కొత్త రోడ్డులో ట్రాన్సఫార్మ్ దగ్గర ఖాళీ ప్రదేశము మరియు శిధిలావస్థ ఉన్న బిల్డింగ్ వద్ద ఆకతాయిల మద్యం సేవించి ఆ యొక్క సీసాలు పారేయడం జరుగుతుందని మేయర్ దృష్టికి తీసుకురాగా పరిశీలించి సదరు ప్రాంతాన్ని శుభ్రపరచుటతో పాటుగా పోలీస్ నిఘా ఏర్పాటుకై సంబంధిత స్టేషన్ ఆఫీసర్ సమాచారం ఇవ్వాలని సూచించారు. లంబాడీపేట పుట్ట రోడ్డులో గల పబ్లిక్ టాయిలెట్స్ యొక్క నిర్వహణా సక్రమముగా లేకపోవుటపై సరిలేదని సంబంధిత ఏజెన్సీకి నోటీసులు, ఇవ్వవలసినదిగా ఆదేశించారు. స్మశాన వెనుక గల నగరపాలక సంస్థ ఖాళి స్థలమును ఆక్రమించి అనధికార కట్టడాలు నిర్మించి పావురాలు మరియు కోళ్లు పెంపకం జరుగుతున్న విషయాన్ని స్థానిక కార్పొరేటర్ వివరించగా సదరు ప్రాంతాన్ని పరిశీలించి తక్షణమే ఖాళీ చేయించి చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలని మరియు నల్లూరు సత్యనారాయణ నగర్ లో ఉన్న కల్వర్ట్ లను ఎత్తు పెంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

పర్యటనలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా.శ్రీదేవి, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్ మరియు శానిటరీ సెక్రటరి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases