ప్రతి అర్జీనకు శాశ్వత పరిష్కారం ముఖ్యం: వీఎంసీ కమిష‌న‌ర్ రంజిత్ భాషా

Related image

విజ‌య‌వాడ‌: ప్రజల నుండి అర్జీ అందుకోవటంతో పాటు సమస్యకు సంతృప్తికరమైన అంతిమ పరిష్కారం ముఖ్యమని కమిష‌న‌ర్ పి.రంజిత్ భాషా అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నేడు జరిగిన స్పందన కార్యక్రమములో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యను పూర్తిగా అర్ధం చేసుకొనవలెనని ప్రతి  వినతిని క్షుణ్ణంగా చదివి వాటి పరిష్కారం కొరకు సరైన అధికారికి అప్పగించాలని తెలియజేస్తూ, సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు.

అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను సక్రమముగా వినియోగించుకొని స్పందన వినతులపై ప్రతి రోజు సమీక్ష నిర్వహించి త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. నేటి స్పందనలో పట్టణ ప్రణాళిక విభాగం - 8, పబ్లిక్ హెల్త్ విభాగం – 1,రెవెన్యూ – 7,ఇంజనీరింగ్ విభాగం– 2, పరిపాలన విభాగం – 1 మరియు యు.సి.డి విభాగం – 3 వెరసి మొత్తం 22 అర్జీలు వచ్చినవి.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఎస్.ఇ నరసింహ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన:
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, సర్కిల్ - 2 కార్యాలయంలో  రెవిన్యూ శాఖ - 1 మరియు పట్టణ ప్రణాళిక విభాగం – 1, మరియు ఇంజనీరింగ్ – 2 అందించగా సర్కిల్ – 1 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.

More Press Releases