ఆహ్లాదకర వాతావరణంలో పరిశుభ్రమైన ఆహారం అందించుటయే ముఖ్య ఉద్దేశ్యం: మల్లాది విష్ణువర్ధన్

Related image

విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క సంస్థ పరిధి నందలి 23, 24 ఎలక్షన్ వార్డు నందలి M.G.రోడ్డు - ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డు నందు రూ.140 లక్షల రూపాయిల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఫుడ్ స్ట్రీట్ (EAT STREET) ను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ స్థానిక కార్పొరేటర్లు కుక్కల అనిత, నెలిబండ్ల బాలస్వామితో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భముగా శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ముఖ్య కూడలి ప్రాంతమైన విజయవాడ నగరంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆహ్లాద భరిత వాతావరణంలో శుభ్రమైన రుచికరమైన వివిధ రకముల ఆహారపదార్ధముల కొరకు ఈ విధమైన ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేసుకొనుట చాలా అవుసరమని రాత్రి గం.10.30 తర్వాత అన్ని హోటల్స్ మూసివేయబడి ఉండుట చేత ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా ఉండాలను ఉద్దేశ్యంతో విదేశాలలో ఉండే విధంగా న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులచేత మంచి డిజైన్లతో ఈ విధమైన (EAT STREET) ను ఏర్పాటు చేసిన కమిషనర్ ను అభినందించినారు. BRTS పరిసర ప్రాంతాలలో కూడా ఈ విధమైన (EAT STREET) ను ఏర్పాటు చేయాలని కమిషనర్ ను కోరారు.

పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ అత్యున్యత ప్రమాణాలతో (EAT STREET) ను ఏర్పాటు చేయుట విజయవాడ నగరానికి తలమానికమని వీటి ఆవశ్యకత కూడా కలదని పేర్కొన్నారు.

కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఖర్చుకు వెనుకాడక ప్రజల సౌకర్యార్ధము చక్కటి అనుభూతి కలిగించు విధముగా ఈ ఫుడ్ స్ట్రీట్ ను శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ వారి సూచనల మేరకు తీర్చిదిద్దుట జరిగినదని ప్రజలు ఉల్లాసంగా సరదాగా గడుపుటకు ఎంతో అనువైన ప్రాంతముగా తీర్చిదిద్దినామని పేర్కొన్నారు. స్టాల్ నిర్వాహకులు నిబంధనలు పాటించు విధముగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణములో శుచిగా, రుచిగా నాణ్యమైన ఆహారపదార్ధములు అందించు విధముగా పర్యవేక్షణ జరిపెదమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమములో న‌గ‌ర పాల‌క సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డా. రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. 

More Press Releases