ఆరోగ్యకరమైన జీవనానికి నడక ఎంతో శ్రేయస్కరం: విజ‌య‌వాడ‌ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Related image

  • స్థానికులు వాకింగ్ ట్రాక్ ను సద్వినియోగ పరచుకోవాలి
విజ‌య‌వాడ‌: కృష్ణలంక 21వ డివిజన్ APSRMC హైస్కూల్ నందు రూ.9.79 లక్షల అంచనాలతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ప్రారంభ కార్యక్రమమునకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా హాజరై తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సి.పి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ పుప్పల నరస కుమారి మరియు పలువురు కార్పోరేటర్లతో కలసి వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు.

ఈ సందర్బంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్ధితులలో ప్రతి ఒక్కరం  ఆరోగ్యoపై ఎంతో ప్రాధాన్యత ఇస్తు శ్రద్ధ కనపరచుట జరుగుతుందని వివరిస్తూ, నగరపాలక సంస్థ ద్వారా అనేక డివిజన్ లలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయుటతో పాటుగా వివిధ క్రీడా ప్రాంగణాలను అత్యాధునికమైన సౌకర్యాలతో అభివృద్ధి పరచుటకై అందరం కృషి చేస్తున్నామని అన్నారు.  స్థానికంగా ఉన్న ప్రజలు ఈ వాకింగ్ ట్రాక్ ను సద్వివినియోగ పరచుకోవాలని ఆకాంక్షించారు. సుదీర్ఘకాలంగా అభివృద్ధి నోచుకోని అనేక ప్రాంతాలను అభివృద్ధి పరచుటయే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.

స్థానికులకు అందుబాటులో ఉండేలా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు హర్షనియం: దేవినేని అవినాష్

స్థానిక ప్రజల అభ్యర్ధన మేరకు కార్పొరేటర్ పుప్పల కుమారి కృషి మేరకు ఈ ప్రాంతములో వాకింగ్ చేసుకొనుటకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయుట హర్షనీయమని తూర్పు వై.ఎస్.సి.పి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి దశగా ఈ ప్రభుత్వం మరియు మంత్రి కృషి చేస్తున్నమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అనేక కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్.సి,పి అని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో ప్రజలకు అన్ని సంక్షేమ పథకములను అందించుటతో పాటుగా అనేక అభివృద్ధి పనులు చేపట్టి ఈ నియోజకవర్గాని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్ళుటం జరుగుతుందని అన్నారు. అదే విధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ చక్కటి ఆహ్లాదకర ప్రదేశంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా విధంగా విశాలమైన ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటం అభినందనియమని, ప్రజల అవసరాలను తీర్చటంలో వై.సి.పి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

కార్యక్రమములో కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి, చింతల సాంబశివ రావు, తాటిపర్తి కొండారెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases