సీతారామపురం కాలువ గట్టు ప్రాంతాన్ని ఆధునికీకరించాలి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

Related image

  • కాలువ గట్టు వెంబడి పారిశుధ్యాని మెరుగుపరుచాలి
విజయవాడ: సీతారామపురం కొత్తవంతెన నుండి మాచవరం డౌన్ వరకు రైవస్ కాలువ గట్టు ప్రాంతాలను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి జరుగుతున్న పనుల వివరములు  అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. కాలువ గట్టు ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కొరకు ప్రణాళికాబద్దంగా తగు చర్యలు చేపట్టవలెనని, పరిసర గృహముల వారికి చెత్త వేయకుండా అవగాహన కల్పించవలేనని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అదే విధంగా కాల్వ గట్టు వెంబడి స్థానికులకు అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంలో ఆయా పరిసర ప్రాంతాలలోని సైడ్ డ్రెయిన్ ద్వారా మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, పాడైన డ్రెయిన్లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతములో గల కర్మల భవనమును పరిశీలిస్తూ, తగిన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు. రైవస్ కాల్వ నందు నీటి ప్రవాహం లేనప్పుడు అంచుల వెంబడి దోమల లార్వా వృద్ధి చెందకుండా చేపడుతున్న యాంటి లార్వా ఆపరేషన్ పనులను బయోలజిస్ట్ ను  అడిగితెలుసుకొని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమ లార్వా వృద్ధి చెందకుండా చూడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు.

తదుపరి గుణదల సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఫైర్ సిస్టం యొక్క పనితీరును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు జరుగుతున్న ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, చేపట్టిన అన్ని పనులు సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. అదే విధంగా కళాక్షేత్రం ప్రక్కన గల కెనాల్ బండ్ నందలి చెత్త మరియు వ్యర్ధములు తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎ.ఎస్.ఎన్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, ఎస్.ఎఫ్.ఓ టి.ఉదయ కుమార్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు, బయోలజిస్ట్ డా.బాబు శ్రీనివాసన్ మరియు ఇతర క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 పారిశుద్ద్య మెరుగుదలకు చర్యలు:
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద ప్రత్యేక గ్యాంగ్ వర్క్ ఏర్పాటు:

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఉదయం క్షేత్ర స్థాయి పర్యటనలో ప్రజారోగ్య శాఖాధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ ఆర్.ఓబేశ్వరరావు పర్యవేక్షణలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వెనుక ప్రత్యేక గ్యాంగ్ వర్క్ ద్వారా కాలువ గట్ల శుభ్రతా కార్యక్రమము నిర్వహించారు.

ఈ సందర్బంగా కాల్వ అంచున చెత్త వ్యర్ధములతో పాటుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి వ్యర్ధములను వాహనముల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించుట జరిగింది. అదే విధంగా బయాలజిస్ట్ డా.బాబు శ్రీనివాసన్ ఆద్వర్యంలో మలేరియా వర్కర్ల బృందము కాల్వగట్టు వెంబడి లార్వా వృద్ది చెందు ప్రదేశాలను గుర్తించి యాంటి లార్వల్ ఆపరేషన్ పనులు చేపట్టారు. కొబ్బరి బొండములను ముక్కలు చేసి పాత టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలు తొలగించి సదరు ప్రదేశములో పారిశుధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవటం జరిగింది.

More Press Releases