సామాన్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార దిశగా చర్యలు: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Related image

  • క్షేత్ర స్థాయిలో ప్రజల అర్జీలను పరిశీలించాలి: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వివిధ శాఖాధిపతులతో క‌లిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజలు తాము ఎదుర్కోను సమస్యలను వివరించుట జరిగింది. నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 7, పట్టణ ప్రణాళిక - 8, రెవెన్యూ – 5, యు.సి.డి విభాగం – 3 మొత్తం 23 అర్జీలు స్వీక‌రించుట జరిగింది.

ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి యొక్క సమస్యలను అడిగితెలుసుకొని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పించిన మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ ఆయా విభాగముల అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన:
సర్కిల్ - 2 కార్యాలయంలో యు.సి.డి విభాగమునకు సంబంధించి -1 అర్జీ, సర్కిల్ – 1 మరియు సర్కిల్ – 3 కార్యాలయాలలో ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.

మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలి: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
 మురుగునీటి ప్రవాహమునకు ఎటువంటి అవరోధం కలుగకుండా సైడ్ డ్రెయిన్ లలో చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా సర్కిల్-3 పరిధిలోని టిక్కిల్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ మొదలగు ప్రదేశాలలో పర్యటిస్తూ, డ్రెయిన్ యొక్క మురుగునీటి పారుదల విధానమును పరిశీలించారు.

ఈ సందర్బంలో డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చర్యలు తీసుకొని డ్రెయిన్ నందు పేరుకుపోయిన చెత్త మరియు సిల్ట్ పూర్తిగా అడుగువరకు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రోడ్ కల్వర్డ్ ల క్రింద తొలగించిన సిల్ట్ వెనువెంటనే అక్కడ నుండి తరలించి పరిసరాలు అన్నియు శుభ్ర పరచునట్లుగా చూడాలని అన్నారు.

ఈ సందర్బంలో పాడైన డ్రెయిన్ లకు వెనువెంటనే తగిన మరమ్మత్తులు చేపట్టి డ్రెయినేజి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మరియు జంక్షన్ వద్ద కల్వర్ట్ ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఇనుప జలేదా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని  ఇంజనీర్ అధికారులకు సూచించారు.

తదుపరి దండమూడి రాజగోపాలరావు ఇన్ డోర్ స్టేడియం నందు చేపట్టిన ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పర్యవేక్షిస్తూ, పనులు వేగవంతము చేసి సత్వరమే స్టేడియం పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ మరియు ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖ క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases