ఈనెల 12 నుండి అందుబాటులోకి చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం: వీఎంసీ కమిషనర్

Related image

  • ప్రజలు సద్వినియోగ పరచుకోవాలి 
విజయవాడ నగరపాలక సంస్థ పరిదిలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ఈనెల 12 (ఆదివారం) నుండి అందుబాటులోనికి తీసుకురానున్నట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్టేడియం నందు క్రీడాకారులకు ఇండోర్ షటిల్, ఇండోర్ జిమ్, ఇండోర్ యోగ, అవుట్ డోర్ వాలీబాల్, అవుట్ డోర్ టెన్నిస్ మొదలుగునవి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని అన్నారు.

క్రీడలకు సంబందించి మరింత సమాచారం, టైం స్లాట్ వివరాలు మరియు ప్రవేశ రుసుము (ఫీజ్) మొదలగు ఇతర సమాచారం తెలుసుకొనుటకుగాను స్టేడియం ఇన్ ఛార్జ్ సెల్ నెంబర్: 9573388597 కు సంప్రదించవలసినదిగా స్పోర్ట్స్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఉదయ కుమార్ ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.

క్షేత్ర స్థాయిలో పర్యటన అధికారులకు పలు ఆదేశాలు: కమిషనర్ ప్రసన్న వెంకటేష్నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుడమేరు వంతెనపై పాడైన రైలింగ్ మరియు పాదచారులు నడిచే పుట్ పాత్ లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో ఏలూరు కాలువ అంచున అల్లూరి సీతారామరాజు పార్క్ వరకు కెనాల్ బండ్ వెంబడి గల చెత్త మరియు వ్యర్ధములను తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మరియు రోడ్ నందలి ప్యాచ్ వర్క్స పనులు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వాంబె కాలనీ హెచ్ బ్లాక్ వద్ద గల ఖాళి స్థలము చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించిన దర్మిల అక్కడ పార్క్ గా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా సంగీత కళాశాల రోడ్ నందు చేపట్టవలసిన ప్యాచ్ వర్క్ పనులను అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు చేస్తూ, పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సచివాలయాల సందర్శన:
సింగ్ నగర్ ప్రాంతములోని 252,253,254 వార్డ్ సచివాలయాలను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క పని విధానము మరియు హాజరును పరిశీలించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం (OTS)పై ప్రజలకు సమగ్ర అవగహన కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటుగా సచివాలయాలలో పని చేయు వారు లబ్దిదారులకు వివరించాలని అన్నారు.

గుణదల ఆర్.ఓ.బి నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న అనాధికార గృహాల తొలగింపు:నగర పరిధిలోని గుణదల ఆర్.ఓ.బి నిర్మాణ పనులకు సంబంధించి గతంలో అక్కడ గల నివాసాల వారికీ JNNURM పథకం ద్వారా నిర్మించిన గృహ సముదాయములో ఇళ్ళు కేటాయించినప్పటికీ అక్కడికి తరలివెళ్ళక ఇక్కడే ఉంటూ నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న ఆక్రమణదారుల యొక్క 20 నివాసాలను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు సిటీ ప్లానర్ జి.వి.జి.వి.ఎస్ ప్రసాద్, ఆద్వర్యంలో బిల్డింగ్ ఇన్స్ పెక్టర్ బేగ్ పర్యవేక్షణలో అక్రమ నిర్మూలన దళ సిబ్బంది ద్వారా సదరు ఆక్రమణలను తొలగించారు.

More Press Releases