పాఠశాలలలో నాడు- నేడు పనులను సకాలంలో పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్

Related image

విజ‌య‌వాడ‌: నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం చాoబర్  నందు నగరంలో చేపట్టిన పలు ఇంజనీరింగ్ అభివృద్ధి పనుల యొక్క స్దితిగతులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. నాడు- నేడు కార్యక్రమములో భాగంగా పాఠశాలలలో చేపట్టిన ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా ప్రజలకు మౌళిక సదుపాయాల మెరుగుదలకై చేపట్టిన పలు అభివృద్ధి పనులు, అర్బన్ హెల్త్ సెంటర్స్  నిర్మాణ పనులు మరియు నున్నలో చేపట్టిన గృహ నిర్మాణాల పనుల యొక్క వివరాలు, వన్ టైం సెటిల్ మెంట్ పథకం అమలు జరుగుతున్న విధానమును సమీక్షించి ఈ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు.

వీటితో పాటుగా నగరంలో ప్రాధాన్యత పనులైన స్విమ్మింగ్ ఫూల్, ఫుడ్ స్ట్రీట్ మరియు పార్క్ ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుటకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, సిటి ప్లానర్ జి.వి.జి.వి.ఎస్ ప్రసాద్, ఎస్.ఇ నరశింహ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు పట్టణ ప్రణాళికాఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ పార్క్ నందు ఆధునీకరణ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి: కమిషనర్ ప్రసన్న వెంకటేష్

రాజీవ్ గాంధీ పార్కు నందు చేపట్టిన ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని బుధవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ ఆవరణలో జరుగుతున్న పనుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. సత్వరమే సందర్శకులకు అందుబాటులో ఉండేలా పార్క్ నందు జరుగుతున్న ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ ఆధునీకరణ పనులు అన్నియు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంలో పార్క్ నందు పిల్లల ఆట పరికరాల ఏర్పాటు పనులు పరిశీలిస్తూ, ఇంకను చేపట్టవలసిన పనులను వెనువెంటనే చేపట్టునట్లుగా చూడాలని అన్నారు. వీటితో పాటుగా పార్క్ ఆవరణలో సందర్శకులకు అందుబాటులో ఉండేలా మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సౌకర్యం మొదలగు సదుపాయాల కల్పనలో దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమమునకు సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్, కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతాభాయి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ బి.దయాకర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మన విజయవాడ – మన భాధ్యత ఆచరించిన పౌరులకు పర్యావరణ నాణేములతో ప్రశంస: అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి
విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో, మన విజయవాడ మన బాధ్యత పేరుతో, SUP యాప్ వివిధ ప్లాస్టిక్ రహిత జోన్‌లలో ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ స్ట్రాలు మరియు ప్లాస్టిక్ మూతలను ఉపయోగించకుండా ఉన్నవారికి ఎకో నాణేలతో sup eco coins యాప్ ద్వారా ప్రోత్సహిస్తుందని అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి అన్నారు.

నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి మరియు ఇతర అధికారులతో కలసి   SUP ఎకో యాప్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్బంలో SUP విజయవాడ లోనే ప్రారంభించామని, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మమ్ములను ప్రోత్సహించి సహకారం అందిస్తున్నారని వారి సూచనల మేరకు నగరంలోని ఇతర వాటా దారులను కలసి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగహన కల్పించి సంపూర్ణ స్ధిరమైన జీవనాన్ని గడపటానికి వారిని ప్రోత్సహించుటకు కృషి చేస్తామని SUP ఎకో యాప్ వ్యవస్థాపకుడు యశ్వంత్ మాడుగుల తెలిపారు.

కార్యక్రమములో డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్, హెల్త్ ఆఫీసుర్లు డా.ఇక్బాల్ హుస్సేన్, డా.రామకోటీశ్వరరావు, డా.బాబు శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases