తానా ప్రపంచ సాహిత్య వేదిక “రాజాకీయ నాయకుల సాహిత్య కోణం” విజయవంతం

Related image

అట్లాంటా, జార్జియా: తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, విజయవంతం చెయ్యడంలో కృషి చేసిన కార్యకర్తలందరికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత రాజకీయ పరిస్ధితులలో ‘న బూతో న భవిష్యతి’ అన్న చందంగా రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు బూతులు మాట్లడంలో పోటీ పడుతున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని ఎటువంటి రాజకీయాలు మాట్లాడకుండా కేవలం తెలుగు సాహిత్యంపై క్లుప్త ప్రసంగాలు చెయ్యడం “న భూతో న భవిష్యతి” అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 28 న జరిగిన 21 వ అంతర్జాల సాహిత్య సదస్సులో “రాజకీయ నాయకుల సాహిత్య కోణం” అనే అంశంపై ...
శ్రీ నిరంజన్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర సమితి, ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి;
శ్రీ షేక్ హుస్సేన్ సత్యాగ్ని, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు, నాటక/కథా రచయిత;
డా. కంకణాల నారాయణ, సి.పి.ఐ జాతీయ కార్యదర్శి;
శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (వై. ఎస్.ఆర్.సి.పి);
శ్రీ బి.వి రాఘవులు, సి.పి.ఐ (ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు;
శ్రీ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర), భా.జ.పా (ఆం.ప్ర) అధికార ప్రతినిధి, ప్రముఖ కథా/నవలా రచయిత;
డా. నర్రెడ్డి తులసి రెడ్డి, ఎం.బి.బి.ఎస్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు;
శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తే.దే.పా, మాజీ మంత్రివర్యులు మరియు
శ్రీ పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణా పి.సి.సి తొలి అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు విశిష్ఠ అతిధులు గా పాల్గొని వివిధ సాహిత్య అంశాలపై అద్భుతంగా ప్రసంగించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఒడుదుడుకులు, ఉద్యమాలతో పెనవేసుకుపోయిన రాజకీయ నాయకుల జీవితాలలో సాహిత్యం, కళలు అంతర్భాగమని, ఈ కార్యక్రమంలో ఇంతమంది రాజకీయ నాయకులు పాల్గొని సాహిత్య సమాలోచన చెయ్యడం చూడ ముచ్చటగా, సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా నమోదు అయ్యింది అన్నారు.

పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చును.

More Press Releases