నగరపాలక సంస్థ ఏపీసీఓఎస్ ఇంటర్వ్యూలకు 401 మంది హాజరు: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

Related image

  • మూడు ప్రదేశాలలో జరుగుతున్న ఇంటర్వ్యూలను స్వయంగా పరిశీలన
  • పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి
విజయవాడ: నగర పరిధిలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ కొత్త బిల్డింగ్, ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు మరియు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా హాలు)లలో జరుగుతున్న ఏపీసీఓఎస్ (APCOS) ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ ప్రక్రియను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా పరిశీలించారు.

ఇంటర్వ్యూ కొరకు వచ్చు వారికీ కల్పిస్తున్న వసతి సదుపాయాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. గాంధీజీ మున్సిపల్ స్కూల్ లో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఐ.వి.ప్యాలస్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి మరియు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవిలతో కూడిన మూడు కమిటి ప్యానల్స్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విధానము పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేస్తూ, అడ్రస్ దృవీకరణ, అర్హత మొదలగు అన్ని పత్రములను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

విజయవాడ నగరపాలక సంస్థ నందలి ఇంజనీరింగ్ విభాగంలో 43, ప్రజారోగ్య శాఖా 40 మరియు ఉద్యనవన విభాగంలో 40 మొత్తం 123 పోస్ట్ లను అవుట్ సోర్సింగ్ పద్దతిలో APCOS ద్వారా భర్తీ చేయుటకు విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు 1209 మంది దరఖాస్తు చేసుకోవటం జరిగింది. వాటిలో స్థానికంగా నివాసం ఉంటున్న 907 మంది యొక్క దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోవటం జరిగింది. రెండు రోజుల పాటు (నేడు మరియు రేపు) జరగనున్న సర్టిఫికెట్స్ పరిశీలన నిమిత్తం ఇప్పటికే ఆయా పోస్ట్ ల కొరకు దరఖాస్తు చేసుకొనిన వారికీ ఏ సెంటర్ నందు ఏ రోజు ఏ సమయంలో హాజరు కావలెనో వివరాలతో కూడిన కాల్ లెటర్స్ పంపించుట జరిగిందని అధికారులు తెలియజేశారు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంకాల్ లెటర్స్ పంపిన వారి సంఖ్యాఇంటర్వ్యూ నకు హాజరు అయిన వారి సంఖ్యా
గాంధీజీ మున్సిపల్ హై స్కూల్155133
ఐ.వి.ప్యాలస్155128
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం160140
Total:470401

More Press Releases