పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలి: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ: బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్, రాజీవ్ గాంధీ పార్క్ లను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం అధికారులతో కలసి పార్క్ లలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంలో చేపట్టిన పనులలో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేస్తూ, ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ పనులు అన్నియు వేగవంతం చేసి సత్వరమే పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ గాంధి పార్క్ లో జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేస్తూ, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి నవంబర్ నాటికీ  పార్క్ సందర్శకులకు అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తదుపరి ఎర్రకట్ట డౌన్ కేదారేశ్వరపేట వద్ద జరుగుతున్న పార్క్ మరియు వాకింగ్ ట్రాక్, గ్రీనరి అభివృద్ధి పనులను పరిశీలించి చేపట్టిన అన్ని పనులు సత్వరమే పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) పి.వి.వి.భాస్కర్ రావు, ఎ.డి.హెచ్. జె. జ్యోతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్విమ్మింగ్ పోటిలలో పథకాలు సాధించిన విధ్యార్ధులను అభినందించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్:
బెంగుళూరులో 19th to 23rd OCTOBER-2021 జరిగిన 47th జూనియర్ & 37th సబ్ జూనియర్ నేషనల్స్ స్విమ్మింగ్ పోటిలలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్విమింగ్ పోటిలకు పాల్గొన్న 58 మంది పిల్లలలో విజయవాడకు సంభందించి గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ ఫూల్ లో శిక్షణ పొందిన ముగ్గురు పిల్లలు పథకాలు సాధించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ లను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్బంలో వారు విజేతలుగా నిలిచిన చిన్నారులను అభినందిస్తూ, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాదించి నగరానికి మణిహారంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంలో శిక్షణ కల్పించిన కోచ్ లను అభినందించారు.

1. ఎన్.దేవా గణేష్ – (1.స్వర్ణ పతాకం, 2.కాంస్య పతాకం)
2. యమ్.యజ్ఞ సాయి – (2. స్వర్ణ పతాకం, 1.సిల్వర్ పతాకం)
3. కె. లాస్య సాయి – (3.స్వర్ణ పతాకం, 1.సిల్వర్ పతాకం, 1.కాంస్య పతాకం)

కార్యక్రమములో ఐ.రమేష్, సెక్రటరీ, K.D.A.A, కె.వి.వి.మోహన రాజా, జూ.అసిస్టెంట్, వి.యం.సి,(టీమ్ మేనేజర్ A.P), అప్పల నాయుడు, (A.P టీమ్ కోచ్) మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.
రూ.19 లక్షల అంచనాలతో సీసీ రోడ్ నిర్మాణ పనులను శ్రీకారం:
పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని పోతిన పాపయ్య విధిలో సుమారు రూ.19 లక్షల అంచనాలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను బుధవారం నగర రాయన భాగ్యలక్ష్మీ, డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీతో కలసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్బంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలపై మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను సత్వరమే పరిష్కారించేలా చర్యలు తీసుకునట్లు వివరించారు.

విజయవాడ నగరంలోని రోడ్లు, త్రాగునీరు, డ్రెయినేజి మొదలగు అన్ని అభివృద్ధి పరచుట జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమములో డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొనకళ్ళ విద్యాధర రావు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.  

More Press Releases