దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు: ఏపీ ఎమ్మెల్సీ షేక్ కరీమున్నీసా

Related image

  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటి హాలు పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలి: కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 
  • 59వ డివిజన్లో పర్యటించిన శాసన మండలి సభ్యురాలు, కమిషనర్
విజయవాడ: నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం శాసన మండలి సభ్యురాలు షేక్  కరీమున్నీసా, 59వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ షహీనా సుల్తానా మరియు అధికారులతో కలసి సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్ తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంలో గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపము, నిర్మాణ పనులు నిలిచిన కమ్యూనిటి హాలు ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. డివిజన్ పరిధిలోని పలు ప్రదేశాలలో పర్యటిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు. గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపమునకు అవసరమైన మరమ్మతులు నిర్వహించుటకు తగిన అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదే విధంగా కళ్యాణ మండపం ప్రక్కన గల రైతు బజార్ వద్దన  ఖాళిగా ఉన్న 4 షాపులలో సచివాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

డివిజన్ నందు గతంలో ఎస్.టి. ఎస్.సి నిధులతో నిర్మాణ పనులు చేపట్టి పూర్తి కానీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటి హాలును పరిశీలించి మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఆ ప్రాంతములో గల ఖాళి స్థలమును పార్క్ గా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.శ్రీనివాస్, ఎస్టేట్ అధికారి డా.ఎ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases