టిడ్కో నివాసాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ విధానాన్ని పరిశీలించిన విజయవాడ మేయర్

Related image

  • సత్వరమే మంజూరు పత్రాలు అందించుటకు చర్యలు
విజయవాడ: టిడ్కో నివాసాలకు సంబంధించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ పూర్తి అయిన వారందరికి వేగవంతముగా మంజూరు పత్రాలు అందజేసేలా చూడాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, బ్యాంక్ అధికారులు మరియు నగరపాలక సిబ్బందికి సూచించారు.

గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు టిడ్కో ఇళ్ళకు సంబంధించి యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 5 బ్రాంచ్ లలోని 1248 లబ్దిదారులకు సోమవారం లబ్దిదారుల సమక్షంలో జరుగుతున్న డాక్యుమెంటేషన్ ప్రక్రియను మేయర్ మరియు కమిషనర్ పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 5424 ఇళ్ళకు సంబంధించి 12 బ్యాంక్ లకు సంబంధించి 78 బ్రాంచ్ నుండి లబ్దిదారులకు ఋణాలు అందించుట జరుగుతుందని, మొదటి విడతగా యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ద్వారా ఎంపిక చేసిన 1248 లబ్దిదారులకుగాను నేడు 894 మంది లబ్దిదారులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రయ పూర్తి చేయుటం జరిగింది. ఈ ప్రక్రియ కొరకు 26 కౌంటర్లు ఏర్పాటు చేసిన 150 మంది సిబ్బంది ద్వారా ఫైనల్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసి చేయుట జరుగుతుందని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్ వివరించారు. లబ్దిదారులకు వెనువెంటనే మంజూరు పత్రాల అందించుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు.

సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 5 బ్రాంచ్ లకు సంబంధించిన అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More Press Releases