కోవిడ్ మహామ్మారిని అదిగమించుటకు పటిష్టమైన చర్యలు: తెలంగాణ సీఎస్

Related image

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి  కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శనివారం సమావేశం నిర్వహించి, రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని తెలుసుకున్నారు. కోవిడ్ మహామ్మారిని అదిగమించుటకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలు:

  • ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 10 వేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ పడకల సంఖ్య 20 వేలకు చేరింది.
  • గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో రాష్ట్రంలో 18,232 కోవిడ్ పడకలు ఉన్నాయి. దీన్ని 49,133 పడకలకు పెంచడం జరిగింది. ఈ సంఖ్యను 60 వేల పడకలకు పెంచడానికి తగు చర్యలు చేపట్టడం జరిగింది. 
  • కోవిడ్ పాజిటివ్ రోగులకు అవసరమైన సేవలను అందించుటకు అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.
  • జీహెచ్ఎంసీలో, కోవిడ్ రోగుల సహాయార్ధం కాల్ సెంటర్ (040-21111111) ఏర్పాటు చేశాం.
  • హోం ఐసోలేషన్ లో ఉన్న పేషంట్లు, కోవిడ్ రోగలక్షణాలు ఉన్న వ్యక్తులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 7.5 లక్షల కోవిడ్ మెడికల్ కిట్ లకు అదనంగా మరో 5 లక్షల మెడికల్ కిట్ లను ఉచితంగా పంపిణీ చేసెందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
  • కోవిడ్ పాజిటివ్ రోగులకు మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందచేసెందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
  • ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచెందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ పనులు వారంలో పూర్తిఅవుతాయి. తదనుగుణంగా నిమ్స్ లో(500), సరోజిని దేవిలో (200), ఛాతీ ఆసుపత్రిలో (50), గాంధీలో (200), టిమ్స్ లో (200) అదనపు పడకలను పెంచాలని నిర్ణయించడం జరిగింది.
  • అదే విధంగా గోల్కొండలో (100), మలక్‌పేటలో (100), వనస్థాలిపురంలో (100), అమీర్‌పేట (50) వంటి ఆసుపత్రులలో అదనంగా కోవిడ్ పడకలు ఏర్పాటు చేయబడతాయి.
  •  అవసరమైన ఔషధాలు ,అవసరమైన మెడికల్ పరికరాలు కొరతను నివారించడానికి, సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం, పనిచేస్తోంది.
  • సీఎం ఆదేశాల ప్రకారం, రోగులకు నాణ్యమైన సేవలను అందించుటకు ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సిలలోని అన్ని ఖాళీలను వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ద్వారా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వేగంగా భర్తీ చేయుటకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించాలని నిర్ధేశించడం జరిగింది. ఈ భర్తీ ప్రక్రియను మానిటరింగ్ చేసే భాద్యతను పి ఆర్ అండ్ ఆర్డి కమిషనర్ రఘునందన్ రావుకు అప్పగించడం జరిగింది. 
  • రెమిడీసివిర్ వంటి ఔషధాల డిమాండ్ దృష్ట్యా, సీఎం కోరిన విధంగా రాష్ట్రానికి తగిన మొత్తాలను సేకరించడానికి జయేష్ రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
  • సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
  • జిల్లాల్లో, (జీహెచ్ఎంసీ మినహ), ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. సీనియర్ జిల్లా అధికారులు ఇతర ఆసుపత్రులకు ప్రత్యేక అధికారులుగా ఉంటారు.
  • టీకాలు ప్రక్రియ: ప్రభుత్వం 18-44 సంవత్సరాల వయస్సులో 1.72 కోట్ల మంది జనాభా ఉంటే, 2021 మే నెలలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేవలం 4.4 లక్షల డోసులను మాత్రమే కేటాయించింది.
  • రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు కేటాయించాలని కేంద్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.
  •  45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రెండవ డోస్ వేయుటకు 30.45 లక్షల డోస్ లు అవసరంకాగా, మే మొదటి పక్షం రోజులకు 8.35 లక్షల డోస్ లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చి, కేటాయింపులు పెంచాలని ప్రధాన కార్యదర్శి లేఖలో కోరారు.
  • ఆక్సిజన్: ఒడిశాకు ట్యాంకర్లను పంపడానికి స్థిరమైన పర్యవేక్షణ, IAF విమానం మరియు రైల్వే రేక్‌ల వాడకం కారణంగా, ఆక్సిజన్ సరఫరా సంతృప్తికరమైన స్థాయిలో నిర్వహించబడుతుంది. అయితే పెరిగిన ఆక్యుపెన్సీతో, ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. సామాగ్రిని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 430 మెట్రిక్ టన్నుల కేటాయించారు. అవసరాల దృష్ట్యా రోజుకు రాష్ట్రానికి 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలని ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
  • ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, ఆరోగ్య శాఖ అడ్వైజర్ టి. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases