శ్రీ "ప్లవ" నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు: పోచారం శ్రీనివాస రెడ్డి

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలు, దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరికీ రేపటి నుంచి ప్రారంభం అయ్యే నూతన “ప్లవ” నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.

వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది.
శార్వరి(అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది.
ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం?
ప్లవ అంటే, దాటించునది అని అర్థం.

"దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది, అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. అలా మనమందరం ఈ నూతన సంవత్సరంలో వెలుగులోకి నడవాలని సభాపతి పోచారం కోరుకున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలు అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా ఉగాది పండుగను జరుపుకోవాలని సభాపతి పోచారం కోరుకున్నారు.

శ్రీ "ప్లవ" నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ:

ప్లవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా గత కొంత కాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నూతన తెలుగు ప్లవ నామ సంవత్సరంలో ఈ సమస్యలు తొలగిపోయి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు బందు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి పది వేల రూపాయలను అందజేస్తుందని, దీనికి తోడు రైతు భీమా పథకం ద్వారా ఆకస్మికంగా మరణిస్తున్న రైతుల కుటుంబాలకు బీమాతో ఆదుకుంటుందని గుర్తు చేశారు.

ప్రవేటు పాఠశాలల్లో పని చేసే టీచర్లకు తిరిగి స్కూళ్లు తెరిచే వరకు వారికి రెండు వేల రూపాయలు, 25 కేజిల బియ్యం అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు వివిధ వర్గాలను ఆదుకునేందుకు ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అభిలాషించారు.

More Press Releases