ధాన్య సేకరణలో తెలంగాణ అపూర్వ ప్రగతిని సాధించింది: పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Related image

హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కృషి, పట్టుదల, ముందుచూపు, దార్శనికత వల్ల ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో వరి సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ధాన్య సేకరణలో అపూర్వ ప్రగతిని సాధించిందని అన్నారు. గురువారం నాడు పౌరసరఫరాల భవన్ లో మీడియాతో మాట్లాడారు.

చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్:

  • ఒక్క తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 నుండి 2020-21 (వానాకాలం) వరకు ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 68వేల కోట్ల రూపాయల విలువ చేసే 3 కోట్ల 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది.
  • ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రంలో కోటి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా యాసంగిలో కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి కానుంది. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి రాష్ట్రంలో 2 కోట్ల 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానుంది. ఇందులో స్థానిక అవసరాలు, లోకల్ మార్కెట్, సీడ్, తదితర అవసరాలకు పోగా మిగిలిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది.
  • ఇప్పటికే వానాకాలంలో 48.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా యాసంగిలో 80 నుండి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాం, రెండు సీజన్లను కలిపి కోటి 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనబోతున్నాం.
  • యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు 6575 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం స్థానిక అవసరాలను బట్టి అవసరమైతే అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.
  • గత ఏడాది (2019-20)యాసంగిలో పౌరసరఫరాల సంస్థ 6,500 కొనుగోలు కేంద్రాల ద్వారా 64.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
  • గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారి ఆదేశాల మేరకు రైతులు ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచిచూసే పరిస్థితి లేకుండా పకడ్భంది చర్యలు తీసుకున్నాం.
  • ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా రైతాంగ సంక్షేమాన్ని కాంక్షించి ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోళ్లకు కావల్సిన 20వేల కోట్ల రూపాయలను పౌరసరఫరాల సంస్థకు సమకూర్చారు.
  • కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17 లోపు ఉండే విధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
  • కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించాలని రైతులకు, అధికారులకు, సిబ్బందికి సూచించారు.
  • మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి.
  • రాబోయే రోజుల్లో భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) బాయిల్డ్ రైస్ (దొడ్డు రకం) ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ యాసంగి సీజన్ లో బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి మొదట్లో ఎఫ్ సిఐ అంగీకరించలేదు.
  • తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ ఎఫ్ సిఐ ద్వారా వెళ్లేది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కూడా వారికి అవసరమైన పంట దిగుబడి అవుతుంది. దీంతో ఎఫ్ సిఐ తమకు 'రా' రైస్ మాత్రమే కావాలి, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని స్పష్టం చేసింది.
  • రైతాంగంపై ఉన్న మక్కువతో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బాయిల్డ్ రైస్ తీసుకునేలా ఎఫిసిఐని ఈ సీజన్ వరకు ఒప్పించారు. ఈ సీజన్లో 80 శాతం బాయిల్ రైస్, 20 శాతం 'రా' రైస్ తీసుకోవడానికి అంగీకరించింది.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో రైతాంగం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి, ఇష్టం వచ్చిన పంటలు వేసి నష్టపోవద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వానాకాలం, యాసంగిలో సంవత్సరాల వారిగా ధాన్య సేకరణ వివరాలను విలేకర్లకు చూపిస్తున్న పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 

 

More Press Releases