ఘనంగా ఆజాదీ కా అమృత్ దినోత్సవ్ త్రీకే రన్

Related image

హైదరాబాద్, మార్చ్ 24: 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతొ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా నేడు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా 3కే రన్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో పెద్ద ఎత్తున క్రీడాకారులు, యువతీ యువకులు, ఉద్యోగులు అధికారులు దాదాపు 3 వేలమంది పాల్గొన్నారు.

పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన ఈ రన్ లుంబిని పార్క్, లక్ డి కాపూల్, కంట్రోల్ రూమ్ మీదుగా ఎల్. బి. స్టేడియం వరకు చేరుకుంది. ఈ రన్ లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు కొద్దీదూరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తిని దేశ ప్రజల్లో నింపేందుకు ఆజాదికా అమృత్ వర్ష్అనే పేరుతొ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ ఘనమైన చరిత్ర, దేశ స్వతంత్ర పోరాటంలో సమర యోధులు చేసిన త్యాగాల గురించి భావితరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేసి 75వ స్వతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది మేధావులు యువతీ యువకులు ఎన్నో కలలతో పుట్టినిల్లని భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతున్న దేశం మన భారత దేశం కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించిన విధానం, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను తెలుసుకోవడంతో పాటు, మహనీయులు యొక్క జీవిత చరిత్రలు చదవాలని యువతకు సూచించారు.

మహనీయులు యొక్క త్యాగ ఫలితమే ప్రస్తుత స్వేచ్ఛా, స్వాతంత్రాలను అనుభవిస్తున్నామని, వారి త్యాగాలను ఎప్పుడూ మనం మరువద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ క్రీడల సంఘాల అధ్యక్షులు, క్రీడాకారులు, విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More Press Releases