ఈనెల 24న 'ఫ్రీడమ్ రన్' ను జెండా ఊపి ప్రారంభించనున్న సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్: భారత దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 వారాల పాటు స్వతంత్ర భారత అమృతోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Telangana State) తేది.24.03.2021 ఉదయం 7.00 గంటలకు (ఆజాది కా అమృత్ మహోత్సవ్) “ఫ్రీడమ్ రన్” నిర్వహిస్తుందని వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఇంచార్జ్) కె.ఎస్.శ్రీనివాస్ రాజు తెలిపారు.

ఈ “ఫ్రీడమ్ రన్” ను  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలసి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రన్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమై ఎల్.బి.స్టేడియం వద్ద ఉదయం 7.45 గంటలకు ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, క్రీడా ప్రముఖులు మరియు క్రీడాకారులు పాల్గొంటారని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

ఫ్రీడమ్ రన్ రూట్ మ్యాప్:
పీపుల్ ప్లాజా - ఇందిరా ప్రియదర్శిని గాంధీ విగ్రహం (ఐమాక్స్ సర్కిల్) - ఎన్టీఆర్ గార్డెన్ - లుంబిని పార్క్ - అమృత కాస్టెల్ - ఎజి ఆఫీస్ - రవీంద్ర భారతి - పోలీస్ కంట్రోల్ రూమ్ - ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్ - ఎల్.బి.స్టేడియం ప్రధాన ద్వారము - ప్రధాన స్టేడియం (ముగింపు).

ఆసక్తి గల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోరారు.

More Press Releases