తెలంగాణ సీఎస్ ను కలిసిన బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు

Related image

హైదరాబాద్: బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టి అమలు తీరుపై అధికారులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గ నిర్ధేశకత్వంలో Tax base లో గణనీయమైన పురోగతిని సాధించడం వలన గత 5 సంవత్సరాలలో Commercial Tax Revenue ను రెట్టింపు చేయడం సాధ్యమైందని తెలిపారు.

2018, 2020లో రెండుసార్లు వాణిజ్యపన్నుల శాఖను హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్ధీకరణ చేయడం జరిగిందన్నారు. ఆర్ధిక వ్యవస్ధలోని ముఖ్యమైన రంగాలలో విశ్లేషణ, పరిశోధన, రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ఏరియాల గుర్తింపు కోసం శాఖలో Economic Intelligence wing ను ఏర్పాటు చేశామన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో టెక్నాలజి వినియోగం, Apps, Data analytics ద్వారా Tax administration system individual base నుండి system driven Tax Administration గా మార్పు చెంది రెవెన్యూ రియలైజేషన్ లక్ష్యాలను సాధించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు.

ఈ సమావేశంలో  Dr.MCRHRD డైరెక్టర్ జనరల్ హర్ ప్రీత్ సింగ్, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూప్రసాద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases