భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్: భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, జంక్షన్లను విద్యుత్ బల్బులతో కాంతులీనేలా అలంకరించాలని తెలిపారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ ఏర్పాట్ల పై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమావేశం జరిగింది. వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న ఉదయం 11.00 గంటలకు పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లిలో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే వరంగల్ లో జరిగే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, జి.ఎ.డి.(పోలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, HMWS & SB మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, TSSPDCL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases