మార్చి చివరి వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ లో.. సాయిదత్త ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం

Related image

సాయిదత్త ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో శైలజ కె నిర్మాతగా చందు అజ్మీర దర్శకత్వంలో 'ప్రొడక్షన్ నెం.1' చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవదాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం పాటల రికార్డింగ్ కార్యక్రమాల్లో వుంది. మార్చి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శైలజ కె మాట్లాడుతూ.. "డైరెక్టర్ చందు అజ్మీర చెప్పిన కథ చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టేలా వుంది. కథానుగుణంగా దేవదాస్ ను హీరోగా తీసుకుంటున్నాము. మంచి టాలెంట్ వున్న అబ్బాయి. హైదరాబాద్, వైజాగ్, కరీంనగర్, వరంగల్, కాకినాడ, నల్గొండ ప్రాంతాల్లో రెండు షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేస్తాము” అని అన్నారు.

హీరో దేవదాస్ మాట్లాడుతూ.. “నా టాలెంట్ ను గుర్తించి ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత శైలజ కె మరియు డైరెక్టర్ చందు అజ్మీర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

దర్శకుడు చందు అజ్మీర మాట్లాడుతూ.. “మాస్, క్లాస్ ఆడియన్స్ కి నచ్చేవిధంగా ప్రేమను సరికొత్త రూపంలో ఈ సినిమాలో చూపించబోతున్నారు. లవ్, కామెడీ, ఎమోషన్స్, ఎమోషన్, యాక్షతో పాటుగా ఎక్కువ మోతాదులో రొమాన్సవుంటుంది. పాత, కొత్త నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 4 ఫైట్లు, 5 పాటలు వుంటాయి. మందుకు, పొందుకు అలవాటుపడ్డ ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనే ఈ సినిమా. ట్యూన్స్ రెడీ అవుతున్నాయి” అని అన్నారు.

దేవదాస్, హాసిని, బ్రహ్మానందం, చమ్మక్ చంద్ర, రఘుబాబు, గోపాల్ రెడ్డి, లక్ష్మణ్, రఘు, దాసు, బాబు నాయక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ అశోక్, లైన్

ప్రొడ్యూసర్ : అంజి, పాటలు : చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, కథ : వెంకట్ - శ్రావణ్ అజ్మీర, సంగీతం : డేవిడ్ జి., డి.ఒ.పి. : విజయ్ ఠాగూర్, నిర్మాత : శైలజ కె., దర్శకుడు : చందు అజ్మీర. 

More Press Releases