వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు న్యాయం? 175 సీట్లలో పోటీ చేసినప్పుడే సీఎం అనే పదం వాడాలి: పవన్ కల్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ
- పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలన్న ముద్రగడ
- తాట తీస్తా, చెప్పుతో కొడతా అంటున్నారని విమర్శ
- ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు
బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మీరు తరచూ అంటున్నారని... అలాంటప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మీరు ఎలా అడుగుతున్నారో తనకు అర్థం కావడం లేదని ముద్రగడ అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడే నన్ను సీఎం చేయండి అనే పదం వాడాలే తప్ప... కలిసి పోటీ చేసేటప్పుడు మీరే సీఎం అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.
పవన్ కు ముద్రగడ రాసిన లేఖ ఇదే:

