Avika: 'పాప్‌కార్న్‌'లో ప్రతి సీన్ అందరికీ నచ్చుతుంది: అవికా గోర్‌

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'పాప్ కార్న్'
  • ఒక షాపింగ్ మాల్ నేపథ్యంలో నడిచే కథ 
  • రేపు విడుదలవుతున్న సినిమా 
  • ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్న అవిక
Avika Interview

అవికా గోర్‌ మనకు 'చిన్నారి పెళ్లికూతురు'గా తెలుసు. 'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్‌గాను తెలుసు. ఆమె ఇప్పుడు 'పాప్‌ కార్న్' సినిమాలో హీరోయిన్‌గా న‌టించట‌మే కాకుండా, కో ప్రొడ్యూసర్‌గాను పరిచయమవుతున్నారు. అవికా గోర్‌ - సాయి రోన‌క్ జంట‌గా నటించిన ఈ సినిమాను, ముర‌ళీ గంధం ద‌ర్శ‌క‌త్వంలో భోగేంద్ర గుప్తా నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న 'పాప్‌ కార్న్' గురించిన విషయాలను అవికా గోర్ పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం...

* పాప్‌కార్న్ సినిమా ఎలా మొదలైంది?

- మా దర్శకుడు మురళి ఈ స్క్రిప్ట్ తో వచ్చారు. కాన్సెప్ట్ గురించి చెప్పారు. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. 90 శాతం లిఫ్ట్ లో జరిగే కథ ఇది. ఓ నటిగా నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. రెండు గంటలా 13 నిమిషాలపాటు నన్నూ, హీరోని చూస్తూ జనాలు కూర్చోవాలి .. అది చాలా టఫ్‌. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కి మంచి కంటెంట్‌ కావాలి .. లేకుంటే మాస్‌ మసాలా కావాలి. వాటి రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ఈ కథ చెప్పారు మురళి. నటిగా నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించిన విషయం కూడా అదే. 

* కథ నచ్చి ప్రొడ్యూస్‌ చేశారా?

- కథ వినగానే, నా పరంగా ఎక్కువ టైమ్‌, అటెన్షన్‌ ఇవ్వాల్సిందేనన్న విషయం అర్థమైంది. నటిగా సెట్‌కి వెళ్లి చెప్పింది చేసి వచ్చేస్తాం. కానీ నిర్మాతగా అయితే, అన్నీ విషయాలనూ పట్టించుకుంటాం. సినిమా ఎలా రావాలి? ఎలా ప్రమోట్‌  చేయాలి? స్క్రిప్ట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ కావాలంటే ఇంకేం చేయొచ్చు... ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. నేను నిర్మాతని కావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ సినిమా కథ వినగానే, ఇదే పర్ఫెక్ట్ టైమ్‌ అనిపించింది. అందుకే ఫస్ట్ స్టెప్‌ వేశాను.

* ప్రొడక్షన్‌ హౌస్‌ని కంటిన్యూ చేస్తారా? 

- చేస్తానండీ .. ఇప్పుడు రెండు సినిమాల పనులు జరుగుతున్నాయి. ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతోంది. ఇంకో సినిమా షూటింగ్‌ చేశాం.

* సాయిరోనక్‌ గురించి చెప్పండి?

-  చాలా అమేజింగ్‌ పర్సన్‌. సెట్స్ మీద కలిసి పనిచేసేటప్పుడు మనకి ఎగ్జైటింగ్‌గా అనిపించాలి. అంతలా హార్డ్ వర్క్ చేస్తారు సాయి రోనక్‌. చాలా హంబుల్‌ పర్సన్‌. చాలా ఎంథూసియాస్టిక్‌గా ఉంటారు. మేం ఇంతకు ముందు 'హ్యాష్‌ట్యాగ్‌ బ్రో' సినిమా చేశాం. అప్పుడు అతని మీద నాకు చాలా మంచి ఇంప్రెషన్‌ క్రియేటైంది. ఈ సినిమాకు కూడా అతణ్ణి నేనే సజెస్ట్  చేశా.

* ప్రొడక్షన్ చేస్తానంటే ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?

- నిర్మాతనవుతానని నేను చెప్పగానే, చేయగలవంటావా? అని అడిగారు నాన్న. ఎందుకంటే నేను సినిమాల్లోకి వస్తానంటే వాళ్లు నన్ను ఎప్పుడూ వద్దని చెప్పలేదు. అలాగని మాకు సినిమాల్లో బంధువులెవరూ లేరు .. గాడ్‌ఫాదర్స్ లేరు. నేను టెక్నికల్‌గా ఔట్‌సైడర్‌ని. అందుకే ముందు ఆ డిస్కషన్‌ జరిగింది. కానీ, ఇది నా కల అని చెప్పగానే మా వాళ్లు సరేనన్నారు.

* స్క్రిప్ట్ లో ఏమైనా ఐడియాలు షేర్‌ చేసుకున్నారా?

- లేదు ..  డైరక్టర్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం. ఎందుకంటే, రైటర్‌గానీ, డైరక్టర్‌గానీ వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలను చాలా బాగా స్క్రీన్‌ మీద పెడతారని నమ్మాను. నా 'ఉయ్యాలా జంపాలా' లలో గానీ, చిన్నారి పెళ్లికూతురులోగాని 'హ్యాష్‌ట్యాగ్‌ బ్రో'లోగానీ జనాలకు నచ్చింది అదే. డైరక్టర్లు వాళ్ల మనసులో ఉన్న విషయాలను స్క్రీన్‌ మీద అందంగా చూపించగలిగారు. ఎందుకంటే అది రైటర్స్ జాబ్‌. నేనైతే కథాపరంగా ఏ సజెషన్సూ ఇవ్వలేదు. కానీ నా కేరక్టర్‌ ఎలా రియాక్ట్ అయితే బావుంటుందోననే విషయాల పట్ల నాకు అనిపించిన సజెషన్స్ కొన్నిసార్లు ఇచ్చినట్టు గుర్తు.

* సినిమా చూశాక ఇండస్ట్రీ వ్యక్తులు ఏమన్నారు?

- నాగార్జున, చైతన్య, నిఖిల్‌.. వీళ్లందరూ చాలా ఆనందంగా ఫీలయ్యారు. పోస్టర్‌ చూసినప్పుడు, నేను వాళ్లతో ఈ విషయం చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకంటే ఈ వయసులో నేను కమర్షియల్‌ సినిమాలు చేస్తూ హ్యాపీగా డబ్బులు పోగేసుకోవచ్చు. కానీ, నేను ప్యాషన్‌తో చేస్తున్నాననే విషయం వాళ్లకు అర్థమైంది. జనాలు నన్ను కేవలం మాస్‌ సినిమాల్లో నటిగా చూడదలచుకోవడం లేదు. అంతకు మించి కోరుకుంటున్నారు. అందుకే నేను కూడా ఇష్టపడి చేయగలుగుతున్నాను.

* ఎప్పుడైనా లిఫ్టులో స్ట్రక్‌ అయ్యారా?

- లేదండీ. అసలు ఎందుకు కావాలి? ఒకవేళ ఎప్పుడైనా లిఫ్టులో నేను స్ట్రక్‌ అయితే, నా పక్కన సాయిరోనక్‌ ఉండాలి. ఎందుకంటే, నన్ను ఎలా బయటకు తీసుకురావాలో అతనికే తెలుసు కాబట్టి.

* లిఫ్టు సెట్టు వేశారా?

- అవునండీ. నాలుగు గోడలతో సెట్‌ వేశాం. నేను ఇంతకు ముందు చాలా సినిమాలు చేశాను. కిడ్నాప్‌ సీన్స్ ఎలా తీస్తారో తెలుసు. మిగిలిన సీన్లు ఎలా తీస్తారో తెలుసు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అవేమీ ఊహించలేకపోయాను. ఏది ఎలా జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ప్రతిరోజూ కొత్తగా అనిపించేది. సెట్లోకి వచ్చిన తర్వాత నాకు సీన్‌ చెప్పేవారు. ఆ ప్రాసెస్‌ నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించేది. చాలా ఎంజాయ్‌ చేసి చేశాను. అది నా పెర్ఫార్మెన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. 

* నాగార్జునగారు ట్రైలర్‌ లాంచ్‌కి వచ్చినప్పుడు, మీరు భావోద్వేగానికి గురయ్యారు...

- ఇలా ట్రైలర్‌ లాంచ్‌ పెట్టుకున్నానని నేను రెండు రోజుల ముందు నాగార్జున సార్‌కి ఫోన్‌ చేయగానే, నా మాట పూర్తికాకముందే, నేను వస్తున్నానని ఆయన అన్నారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అలాంటి సపోర్ట్ అందినప్పుడు భావోద్వేగానికి గురవడం కామనే. ఆ ఫ్యామిలీ నన్ను సొంత బిడ్డగా చూసుకుంటుంది. చైతూతో పాటు తెలుగు హీరోలు చాలా మంది నాకు సపోర్ట్  చేశారు.

* ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ ఏంటి?


- తెలుగు సినిమాలు కొన్ని చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్ మెంట్లు వస్తాయి. హిందీలో మహేష్‌భట్‌, విక్రమ్‌భట్‌ సినిమా 1920లో చేస్తున్నా. మేలో ఆ సినిమా విడుదలవుతుంది" అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు అవికా గోర్‌.

More Telugu News