Turkey: టర్కీలో మళ్లీ భూకంపం... వేలల్లో మృతుల సంఖ్య!

  • ఈ ఉదయం టర్కీ, సిరియాలను కుదిపేసిన భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదు
  • ఈ మధ్యాహ్నం 7.5 తీవ్రతతో మరో భూకంపం
  • ఒకినోజు పట్టణానికి చేరువలో భూకంప కేంద్రం
Another massive earthquake hits Turkey

మధ్య ప్రాచ్య దేశాలు టర్కీ, సిరియాలను ఈ ఉదయం 7.8 తీవ్రతతో భారీ భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వేలాది భవనాలు నేలమట్టం కాగా, 1200 మందికి పైగా ప్రాణాలు విడిచారు. కాగా, టర్కీని ఈ మధ్యాహ్నం మరో భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. 

స్థానిక కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 1.24 గంటలకు రెండో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం ఎకినోజు పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. తాజా భూకంపంతో జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్క టర్కీలోనే మృతుల సంఖ్య వేలల్లో ఉండొచ్చని భావిస్తున్నారు.

More Telugu News