Telangana: కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. మాక్ డ్రిల్ అంటున్న అధికారులు!

  • ఈ తెల్లవారుజామున సచివాలయం నుంచి దట్టమైన పొగలు
  • ఏ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయనే దానిపై లేని స్పష్టత
  • 11 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి తెచ్చిన సిబ్బంది 
Officials say that It was a mock drill in the new secretariat

హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఒడ్డున ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం వార్తలు కలకలం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. సచివాలయ సమీపంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. ప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఏ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయనే దానిపైనా స్పష్టత లేదు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు.

 ఐదు, అరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని పరిశీలించారు. అయితే, అగ్ని ప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. కేవలం మాక్ డ్రిల్ అని చెబుతున్నారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. దాంతో, జరిగింది అగ్నిప్రమాదమా? కాదా? అనేది తెలియడం లేదు. దట్టమైన పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.

More Telugu News