single wheeled: ఈ బైక్ ను అందరూ నడపలేరు.. అదే దీని ప్రత్యేకత!

  • ఒకే చక్రంతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్
  • కేటీఎం మోటార్ సైకిల్ మాదిరి తయారీ
  • హాబీతో సొంతంగా తయారు చేసుకుని నడిపేస్తున్న యువకుడు
Home made single wheeled self balancing KTM bike

స్కూటర్ అయినా, బైక్ అయినా, ఆఖరికి సైకిల్ అయినా సరే కనీసం రెండు చక్రాలు ఉంటేనే నడుస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఒక్క టైర్ ఉన్నా చాలంటున్నాడు ఈ యువకుడు. కేటీఎం మోటార్ సైకిల్ ను ఒక్క చక్రం బైక్ గా మార్చేశాడు. అంతేకాదు దీన్ని నడుపుతూ ఓ వీడియో తీశాడు. దీన్ని క్రియేటివ్ సైన్స్ అనే యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేశాడు. 

ఈ బైక్ ను కావాల్సినట్టుగా అతడు మార్పులు చేసుకున్నాడు. నిజానికి మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక మోటార్ సైకిల్ నిర్మాణంలో మార్పులు చేయడం నేరం. కానీ, ఇతడు తన హాబీ కొద్దీ ఇలా మార్పులు చేసేశాడు. యమహా ఎఫ్ జెడ్ మోటారు సైకిల్ ట్యాంక్ తీసుకొచ్చి కేటీఎం బైక్ బాడీకి పెట్టేశాడు. ఒకే చక్రంతో నడుస్తుంది కనుక సీటుపై కూర్చున్నప్పుడు జారిపోకుండా అనుకూలంగా ఉండేదాన్ని అమర్చుకున్నాడు. పైగా దీన్ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చి అతడు సునాయాసంగా నడిపేస్తుండడం ఆశ్చర్యకరం. 


More Telugu News