Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు

  • తనపై అత్యాచారం చేశారంటూ సూరత్ కు చెందిన మహిళ ఆరోపణ
  • అత్యాచారం చేశాడని నిర్ధారించిన కోర్టు
  • ఇప్పటికే మరో అత్యాచారం కేసులో జైల్లో ఉన్న ఆశారాం
Gandhinagar Sessions Court sentenced  Asaram to life imprisonment

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ లోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదును విధించింది. తన ఆశ్రమంలో శిష్యురాలిగా ఉన్న మహిళను నిర్బంధించి 2001 నుంచి 2006 మధ్య పలుమార్లు అత్యాచారం చేశారనే కేసులో ఆయనకు కోర్టు ఈ జీవిత ఖైదును ఖరారు చేసింది. ఆశారాంపై సూరత్ కు చెందిన ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. దీనిపై 2013లో ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో అత్యాచారం కేసులో కూడా దోషిగా తేలిన ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్థాన్ లోని జోధ్ పూర్ జైల్లో ఉన్నారు. వేలాది మంది శిష్యులను సంపాదించుకున్న ఆశారాంకు విదేశాల్లో సైతం కేంద్రాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి అత్యాచార కేసుల్లో దోషిగా తేలి కటకటాలపాలు కావడం గమనార్హం.

More Telugu News