India: మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

  • దక్షిణాఫ్రికాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్
  • ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీ
  • 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్
  • ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 ఆలౌట్
  • 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసిన భారత్
  • రాణించిన తెలుగమ్మాయి త్రిష
India wins womens under 19 world cup

ప్రపంచ క్రికెట్ లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత్ చాంపియన్ గా ఆవిర్భవించింది. ఇవాళ పోచెఫ్ స్ట్రూమ్ లో ఇంగ్లండ్ అమ్మాయిలతో జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

తొలుత ఇంగ్లండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూల్చిన భారత్... ఆపై స్వల్ప లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ షెఫాలీ వర్మ 15, మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 5 పరుగులు చేశారు. ఆ తర్వాత తెలుగమ్మాయి గొంగడి త్రిష 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యాతివారి 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చింది. 

మహిళల అండర్-19 విభాగంలో తొలిసారి నిర్వహించిన ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత చేజిక్కించుకోవడం విశేషం.

More Telugu News