brian lara: పెర్ఫామెన్స్ మెంటార్ గా వెస్టిండీస్ జట్టులోకి బ్రియాన్ లారా!

  • మూడు ఫార్మాట్లలో ఆటగాళ్లకు సలహాలు ఇవ్వనున్న లారా
  • ప్రధాన కోచ్‌లకు సహాయం చేయడమే లారా పని 
  • జట్టుతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని వెల్లడి
brian lara takes up new west indies role

దిగ్గజ బ్యాట్స్ మన్ బ్రియాన్ లారా తిరిగి వెస్టిండీస్ జట్టులో చేరాడు. ‘పెర్ఫామెన్స్ మెంటార్’గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టు, బోర్డు అకాడమీ కోసం పనిచేయనున్నాడు. ఆటగాళ్లకు వ్యూహాత్మక సలహాలను అందించడంలో, వారి గేమ్ సెన్స్‌ను మెరుగుపరచడంలో ప్రధాన కోచ్‌లకు సహాయం చేయడమే లారా పని అని క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది.

‘‘ఆస్ట్రేలియాలోని ఆటగాళ్లు, కోచ్‌లతో సమయం గడిపాను. సీడబ్ల్యూఐతో చర్చించాను. గేమ్ విషయంలో ఆటగాళ్లకు సహాయం చేయగలనని నేను నమ్ముతున్నా. అలాగే వారి వ్యూహాలను మరింత విజయవంతంగా అమలు చేసేలా సాయం చేయగలను. వారితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బ్రియాన్ లారా పేర్కొన్నాడు. వచ్చే వారంలో జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ముందుగా టెస్ట్ టీమ్ తో కలిసి లారా పనిచేయనున్నాడు.

తన కెరియర్ లో  131 టెస్టులు ఆడిన లారా.. 52.88 సగటుతో 11,953 పరుగులు చేశాడు. వన్డేల్లో 10,405 పరుగులు కొట్టాడు. 2004లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగులు కొట్టి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో 400 రన్స్ కొట్టింది లారా ఒక్కడే. దాదాపు 19 ఏళ్లు దాటినా ఈ రికార్డు చెక్కుచెదరలేదు.

More Telugu News