KCR: కేసీఆర్ ను కలిసిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు.. ఫొటోలు ఇవిగో

  • శివాజీ 13వ వారసుడు శంభాజీ
  • కొల్హాపూర్ సంస్థాన వారసుడు శంభాజీ
  • శివాజీ వంశస్తుల సేవలను స్మరించుకుకున్న కేసీఆర్, శంభాజీ
Chhatrapati Shivaji descendant Sambaji meets KCR

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి యువరాజ్ శంభాజీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. కొల్హాపూర్ సంస్థాన వారసుడిగా శంభాజీ ఉన్నారు. స్వరాజ్ ఉద్యమకారుడిగా ఆయనకు పేరుంది. 

ఈ సందర్భంగా పూర్వీకులు శివాజీ నుంచి శంభాజీ తాత సాహూ మహరాజ్ వరకు ఈ దేశానికి వారు చేసిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారు అందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి స్ఫూర్తితోనే తెలంగాణలో కుల, మత వివక్ష లేకుండా ప్రజా పాలన కొనసాగుతోందని ఈ సందర్భంగా చర్చలో కేసీఆర్ తెలిపారు. మరోవైపు 'రాజర్షి సాహూ ఛత్రపతి' పుస్తకాన్ని కేసీఆర్ కు శంభాజీ అందించారు.

More Telugu News