Team India: చెలరేగుతున్న భారత బౌలర్లు..15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్

  • రెండు వికెట్లు పడగొట్టిన షమీ
  • సిరాజ్, పాండ్యా, శార్దూల్ కు ఒక్కో వికెట్
  • పెవిలియన్ కు క్యూ కడుతున్న కివీస్ ఆటగాళ్లు  
newzeland lose 5 wickets early

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతూ న్యూజిలాండ్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. రాయ్ పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా.. అతని నిర్ణయానికి బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. 15 పరుగులకే సగం వికెట్లు కూల్చేశారు. సీనియర్ పేసర్‌‌ మహ్మద్ షమీ ఇన్నింగ్స్ ఐదో బాల్ కే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రత్యర్థిని తొలి దెబ్బకొట్టాడు. ఐదో ఓవర్లో అద్భుత ఔట్ స్వింగర్ తో సిరాజ్.. హెన్రీ నికోల్స్ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే డారిల్ మిచెల్ (1) షమీ రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు.

పదో ఓవర్లో డెవాన్ కాన్వే (7)ను కూడా హార్దిక్ పాండ్యా రిటర్న్ క్యాచ్ తో వెనక్కు పంపాడు. ఆపై, శార్దూల్ ఠాకూర్.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (1)ను ఐదో వికెట్ గా ఔట్ చేశాడు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్ (8 బ్యాటింగ్), తొలి మ్యాచ్ హీరో మైకేల్ బ్రేస్ వెల్ (4 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. డ్రింక్స్ విరామ సమయానికి కివీస్ 14 ఓవర్లలో 28/5 స్కోరుతో నిలిచింది. తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News